కోటం రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పలువురు జర్నలిస్ట్ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కాగా నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు కూడా కోటంరెడ్డిపై సీఎం జగన్ కి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి జమీన్ రైతు వారపత్రిక అధినేత డోలేంద్ర ప్రసాద్ మీద కోటంరెడ్డి దాడి చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. కోటం రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా.. ఓపత్రికాధినేత పై కోటంరెడ్డి వ్యవహరించిన తీరుపై టీడీపీ, బీజేపీ, సీపీఎం పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మీడియాపై దాడులకు నిరసనగా జర్నలిస్ట్ సంఘాలు ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాయి. కోటం రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పలువురు జర్నలిస్ట్ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కాగా నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు కూడా కోటంరెడ్డిపై సీఎం జగన్ కి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తనపై దాడాి చేశారని జమీన్ రైతు వారపత్రిక ఎడిటర్ డోలేంద్ర ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి 7గంటల 30 నిమిషాలకు కోటంరెడ్డి మాగుంట లేఅవుట్ లో ఉన్న తన ఇంటికి మద్యం తాగి వచ్చారని డోలేంద్ర చెప్పారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే సొంత ఊరికి చెందిన డాక్టర్ వసుంధర తనతో మాట్లాడి బయటకు వస్తున్న సమయంలో ఎమ్మెల్యే ఆమె చేయి పట్టుకొని ఇంట్లోకి లాక్కొచ్చారని చెప్పారు.
ఎమ్మెల్యేపై వార్తలు రాసినందుకు తనపై తీవ్రస్థాయిలో మండిపడినట్లు చెప్పారు. చంపేస్తానని బెదిరించారని తెలిపారు. తాను అధికార పార్టీ ఎమ్మెల్యే అని తనను ఎవరూ ఏమీ పీకలేరని.. మంత్రితో, ముఖ్యమంత్రి జగన్ తో చెప్పుకున్నా కూడా తనను ఎవరూ ఏమీ చేయలేరని బెదిరించినట్లు చెప్పారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 12, 2019, 2:48 PM IST