మన్మధుడు 2 మూవీ రివ్యూ: మరిన్ని వార్తలు

By rajesh yFirst Published Aug 9, 2019, 5:53 PM IST
Highlights

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

జాతీయ పురస్కారాలు.. ఉత్తమ తెలుగు చిత్రం 'మహానటి', ఉత్తమ నటి కీర్తి సురేష్!

జాతీయ స్థాయిలో సినిమా రంగానికిచ్చే ‘జాతీయ చలన చిత్ర అవార్డుల’ను ఆగస్ట్ 9న ప్రకటించారు. ఈ అవార్డుల్లో మహానటి, రంగస్థలం చిత్రాలు టాప్ అవార్డులను దక్కించుకున్నాయి. 

 

'మన్మథుడు-2' రివ్యూ..!

గతంలో వచ్చిన హిట్ సినిమా ఇమేజ్ ని క్యాష్ చేసుకోవాలనుకున్నప్పుడు పుట్టే ఐడియానే సీక్వెల్. అయితే చాలా సీక్వెల్స్ ..అంతకు ముందు సినిమా ఎక్కడ ఆగిందో ...ఆ తర్వాత వారి జీవితంలో ఏం జరిగింగో చెప్పటానికి ప్రయత్నిస్తూంటాయి.

 

జాతీయ అవార్డుల్లో 'రంగస్థలం'కు నిరాశ.. నార్త్ లాబీయింగ్!

66వ జాతీయ చలన చిత్ర వార్డులని 2018 సంవత్సరానికి గాను కొద్ది సేపటి క్రితమే ప్రకటించారు. ఉత్తమ చిత్రంగా గుజరాతీ చిత్రం 'హెల్లరో' జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. ఉత్తమ దర్శకుడిగా 'ఉరి' చిత్రాన్ని గాను ఆదిత్య ధార్ కి అవార్డు దక్కింది. ఉత్తమ నటిగా మహానటి చిత్రానికి గాను కీర్తి సురేష్ జాతీయ అవార్డు కైవసం చేసుకోవడం విశేషం. 

 

రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తే ఏం చేస్తావ్.. పునర్నవితో రాహుల్ ముచ్చట!

బిగ్ బాస్ మెయిన్ ఎపిసోడ్ లో చూపించని కంటెంట్ తో బిగ్ బాస్ బజ్ అంటూ స్టార్ మ్యూజిక్ లో ఓ కార్యక్రమం ప్రసారమవుతోంది. అందులో రాహుల్, పునర్నవిల ముచ్చట హైలైట్ గా నిలిచింది. 

 

యజమాని కూతురితో, రెండో భార్యతో అక్రమ సంబంధం.. చివరికి

భార్య వివాహేతర సంబంధం భర్త ప్రాణాలను బలి తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు కృష్ణగిరి జిల్లా శూలగిరి తాలూకా బీజీ దుర్గం గ్రామానికి చెందిన ఈశ్వరన్ అనే వ్యక్తికి సూడమ్మ, విజయ అనే ఇద్దరు భార్యలున్నారు. మొదటి భార్య సూడమ్మకు కోదిల, సరళ అనే ఇద్దరు కుమార్తెలున్నారు.

 

పోలవరం కాఫర్ డ్యామ్ వద్ద చిక్కుకొన్న 31 మంది మత్య్యకారులు

పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ వద్ద 31 మంది మత్య్సకారులు చిక్కుకొన్నారు మత్య్సకారులను రక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకొంటున్నారు. 

 

చంద్రబాబు వల్లే పోర్టు ఆగిపోయింది.. జీవీఎల్ కామెంట్స్

శుక్రవారం ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలంలోని రామాయపట్నం పోర్టు ఏరియాను బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు సందర్శించారు.

 

మా కష్టంతో తెచ్చిన కంపెనీలను బెదిరించడం కాదు... లోకేష్ సెటైర్

మీ దౌర్జన్యాలకు బెదిరి, వాళ్లు వెళ్లి మోదీగారి దగ్గర పంచాయతీ పెడితే, మొన్న ఢిల్లీలో ఉండి సంజాయిషీ ఇచ్చుకున్నట్లుగా మళ్లీ ఢిల్లీ పరుగెత్తాల్సి ఉంటుంది. అయినా మీ నాయనగారికి ఇచ్చిన మాట కోసం కియా వాళ్లిక్కడ ప్లాంటు పెట్టారని చెప్పుకుంటూ ఈ దాడులేంటండీ జగన్ గారు’’ అని లోకేష్ సెటైర్లు వేశారు. 

 

బందరు పోర్టు: చంద్రబాబుకు షాక్, జగన్‌కు జై కొట్టిన కేశినేని

టీడీపీ ఎంపీ కేశినేని నాని జగన్ కు జై కొట్టారు. బందరు పోర్టు ఒప్పందం  రద్దు చేస్తూ తీసుకొన్న నిర్ణయంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 

 

జగన్ 70 రోజుల పాలనకు రెఫరెండం ఆ 98 మంది బలిదానాలే : కాల్వ శ్రీనివాసులు

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపుగా 98 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. రైతుభరోసా పథకాన్ని నిలిపివేయడం, రైతులకు ఇవ్వాల్సిన రుణాలు ఇవ్వకపోవడం వల్లే రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడ్డారని చెప్పుకొచ్చారు. 

 

జగన్ లా నాడు వైయస్ కూడా చేయలేదు : అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు

రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా ఉన్నాయని ఆరోపించారు. ఇప్పటి వరకు ఏడుగురు టీడీపీ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారంటూ ధ్వజమెత్తారు. అందుకే జగన్ ప్రభుత్వానికి కక్ష సాధింపు ప్రభుత్వంగా ముద్రపడిందని విమర్శించారు. టీడీపీ కార్యకర్తలపై దాడులకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.  
 

 

నేను ఏదైతే చెప్పానో జగన్ అలానే చేస్తున్నాడు: చంద్రబాబు నాయుడు

పాలన అనుభవం లేని జగన్ అన్నింటిని రద్దు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. పోలవరం కాంట్రాక్ట్‌ రద్దుచేశారని ప్రస్తుతం అన్న క్యాంటీన్లు కూడా తొలగించేస్తున్నారని  ఆరోపించారు.  తన జ్ఞపకాలు ఉండొద్దని జగన్ అన్నీ రద్దు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. 

 

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

తిరుపతికి కారులో వెళ్తున్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు లారీని కారు ఢీకోట్టడంతో ఈ ఘటన చోటు చేసుకొంది. ప్రకాశం జిల్లా మోచర్ల వద్ద ఈ ప్రమాదం జరిగింది.

 

కేంద్రం పునరాలోచన, జగన్ సమీక్ష: భోగాపురం ఎయిర్ పోర్టుకు ఎసరు

భోగాపురం విమానాశ్రయం నిర్మాణం ప్రాజెక్టుపై 2015లో నిర్ణయం తీసుకున్నారు. దాని రన్ వే 3800 కిలోమీటర్లు ఉంటుంది. దీనికి 2017లో పర్యావరణ అనుమతులు లభించాయి. ఈ ప్రాజెక్టుకు కావాల్సిన భూమి 2700 ఎకరాలు.

 

అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరిన వివేక్

మాజీ ఎంపీ వివేక్ బీజేపీలో చేరారు. కొంత కాలంగా ఆయన బీజేపీలో చేరుతారని ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరాలని ఉత్తమ్ ఆహ్వానించారు. కానీ, వివేక్  మాత్రం బీజేపీ వైపుకు మొగ్గు చూపారు. 

 

ప్రవీణ్ ఓ సెక్స్ ఉన్మాది.. ఆడవారి చీర కనిపించినా...

అతను ఓ సెక్స్ ఉన్మాది అని చెబుతున్నారు. ఆడవాళ్ల చీరలు బయట తీగలపై ఆరేసి ఉన్నా.. వాటి వాసన చూసి కూడా ఉద్రేకానికి లోనయ్యేవాడని చెబుతున్నారు. ప్రతి నిమిషం సెక్స్ కోసం పరితపిస్తాడని చెప్పారు.  సెక్స్ కోరిక తీర్చుకోవడం కోసం నానా రకాలుగా ప్రవర్తించేవాడని వారు అంటున్నారు.

 

సెప్టెంబర్ 17తో బిజెపి స్కెచ్: కేసీఆర్ కు చుక్కలు

సెప్టెంబర్ 17 ఏదైతే తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని బిజెపి డిమాండ్ చేస్తూ వస్తోందో, అదే రోజు అమిత్ షాను రప్పించి ఇక్కడ భారీ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని యోచిస్తోంది. 

 

మహానటి దయతో కీర్తి కెరీర్ యూ టర్న్!

మహానటి సావిత్రి జీవిత ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' సినిమా అందించిన విజయం చిత్ర యూనిట్ లో ప్రతి ఒక్కరి కెరీర్ కు యూ టర్న్ అనే చెప్పాలి. రెండు జాతీయ అవార్డులను అందుకొని మహానటి ఖ్యాతిని మరింత పెంచుకుంది. ఈ సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ మరో స్థాయికి చేరుకుంది. 

 

మన్మథుడు2: రిలీజ్ రోజే నేషనల్ అవార్డ్.. వాటే మూమెంట్!

ఎంత చిన్న సినిమా తీసినా అనుకున్న పాయింట్ ని ఎలాంటి తప్పులు లేకుండా ప్రజెంట్ చేయగలిగితే అవకాశాలు వాటంతట అవే వస్తాయి. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ విషయాన్నీ మరోసారి గుర్తు చేశాడు. అతను చేసిన మొదటి సినిమాకు స్క్రీన్ ప్లే విభాగంలో జాతీయ అవార్డు లభించింది. 

 

'సాహో' థియేటర్లలో 'సైరా' హడావిడి!

'సై మా' అవార్డుల వేడుకలో భాగంగా 'సై రా' థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అక్కడ లాంఛనంగా ట్రైలర్ రిలీజ్ చేసి ఆ తరువాత 'సాహో' థియేటర్లలో ట్రైలర్ ని ప్రదర్శించాలని అనుకుంటున్నారు.

 

బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్.. అజిత్ నటన చూసి సూర్య, జ్యోతిక ఏం చేశారంటే!

క్రేజీ హీరో తలా అజిత్ నటించిన పింక్ రీమేక్ 'నెర్కొండ పార్వయి' చిత్రం గురువారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీలో అమితాబ్ బచ్చన్, తాప్సి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. అక్కడ పింక్ చిత్రం ఘనవిజయాన్ని అందుకుంది. దీనితో ఈ చిత్ర రీమేక్ హక్కులకు భారీ డిమాండ్ నెలకొంది. 

 

అమ్మాయి పుట్టింది.. మంచు విష్ణు పోస్ట్!

విష్ణు దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరిలో అవియానా, వివియానా కవలలు కాగా కొడుకు అవ్రమ్ ఉన్నాడు. ఇప్పుడు మంచు విష్ణు మరోసారి తండ్రి కావడంతో సోషల్ మీడియాలో సినిమా ప్రముఖులతో పాటు అభిమానుల నుంచి విష్ణుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

 

అవి డబుల్ మీనింగ్ డైలాగ్స్ కాదు.. మన్మథుడు2 డైరెక్టర్!

కింగ్ నాగార్జున నటించిన మన్మథుడు 2 చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముందుగా ఈ చిత్రం నాగార్జున ఐకానిక్ ఫిలిం మన్మథుడుకి సీక్వెల్ అనుకున్నారు. దీనితో ఫ్యామిలీ ఆడియన్స్, నాగార్జున అభిమానుల్లో ఈ చిత్రంపై మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత చిత్ర యూనిట్ ఇది మన్మథుడు సీక్వెల్ కాదని ఓ ప్రెంచ్ చిత్రానికి రీమేక్ అని ప్రకటించింది. 

 

రాజీవ్ కనకాల, సుమల ప్రొఫెషనలిజం!

ఇటీవల నటగురువు దేవదాస్ కనకాల మరణించిన సంగతి తెలిసిందే. ఆయన కొడుకు రాజీవ్, కోడలు సుమ కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. దేవదాస్ గారి మరణం తరువాత అంత్యక్రియలను పూర్తి చేసి మూడు రోజుల్లో ఇద్దరూ తిరిగి తమ పనుల్లో యథావిధిగా పాల్గొంటున్నారు. 

 

జగన్ తో భేటీ: పృథ్వీ కామెంట్స్ పై రాజేంద్రప్రసాద్ రియాక్షన్!

తాజాగా సినీ నటుడు రాజేంద్రప్రసాద్ పృథ్వీకి కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన రాజేంద్రప్రసాద్ 'సీఎంని వెంటనే కలవడానికి సినీ నటులేం వ్యాపారవేత్తలు కాదు.. కళాకారులు సీఎంని కలవాలన్న నిబంధన ఏమీ లేదని' రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించడం విశేషం. 

 

భారీ వర్షాలు: అప్రమత్తమైన రాష్ట్రాలు, రంగంలోకి నేవీ

మహారాష్ట్ర, కర్ణాటక, కేరళలో వరద ప్రభావిత ప్రాంతాల్లో  భారత నావిక దళం తన సేవలను అందించనుంది. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో నావిక దళం పూర్తి ఏర్పాట్లు చేసింది.
 

 

వరదల్లో సెల్ఫీలకు ఫోజులిచ్చిన మంత్రి.. నెటిజన్ల విమర్శలు

పడవలో ప్రయాణిస్తూ ఆనందంగా చేతులు ఊపుతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అంతే.. ఆ వీడియోని చూసి నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దీనిపై ఎన్సీపీ నాయకుడు ధనుంజయ్ ముండే స్పందించారు. మంత్రి గిరీష్ మహాజన్ పై సీఎం ఫడణవీస్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

కర్ణాటకలో భారీ వర్షాలు... బాధితులకు అండగా నిలిచిన సువర్ణ న్యూస్

ఉత్తర కర్ణాటక, మలాండ్ ప్రాంతాల్లో వరద ఉధృతి అధికంగా ఉంది. బాధితులు సహాయం చేసేవారి కోసం ఎదురుచూస్తున్నారు. కనీసం తినడానికి ఆహారం, తాగడానికి మంచినీరు కూడా లభించని స్థితిలో బాధితులు ఇబ్బందులుపడుతున్నారు. దీంతో.. సువర్ణ న్యూస్ యాజమాన్యం.. వరద బాధితులను ఆదుకునేందుకు సహాయ నిధి ఏర్పాటు చేసింది.

click me!