పాలన అనుభవం లేని జగన్ అన్నింటిని రద్దు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. పోలవరం కాంట్రాక్ట్ రద్దుచేశారని ప్రస్తుతం అన్న క్యాంటీన్లు కూడా తొలగించేస్తున్నారని ఆరోపించారు. తన జ్ఞపకాలు ఉండొద్దని జగన్ అన్నీ రద్దు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. వైయస్ఆర్సీపీ ప్రభుత్వం రద్దుల ప్రభుత్వంగా మారిందంటూ దుయ్యబుట్టారు.
సీఎం జగన్ కు తన అనుభవమంత వయసు లేదని కానీ తనను విమర్శిస్తారా అంటూ ప్రశ్నించారు. గుంటూరు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాలన అనుభవం లేని జగన్ అన్నింటిని రద్దు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. పోలవరం కాంట్రాక్ట్ రద్దుచేశారని ప్రస్తుతం అన్న క్యాంటీన్లు కూడా తొలగించేస్తున్నారని ఆరోపించారు. తన జ్ఞపకాలు ఉండొద్దని జగన్ అన్నీ రద్దు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు.
మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులను తాము కూడా పూర్తి చేశామని కానీ జగన్ లా ప్రవర్తించలేదంటూ మండిపడ్డారు. అన్నీ రద్దు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం మరీ టీడీపీ హయాంలో వచ్చిన సీసీ రోడ్లు, మరుగుదొడ్లు కూడా తొలగిస్తారా? అంటూ నిలదీశారు.
పెన్షన్లపై వైసీపీ ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసిందని విమర్శించారు. రూ.200 పెన్షన్ రూ.2 వేలుకు పెంచితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విడతల వారీగా రూ.200 పెంచుతూ వారికి ఇస్తారంట అంటూ మండిపడ్డారు.
ఎన్నికల ప్రచారంలో వైసీపీ వస్తే ఏం జరుగుతుందో ఎన్నికల ముందే చెప్పామని, తాను చెప్పినట్టే జరుగుతోందన్నారు.తాను ఏం చెప్పానో జగన్ పాలన అలానే ఉందని విమర్శించారు. పసుపు రంగు ఉందని అన్న క్యాంటీన్లను తొలగిస్తారా అంటూ మండిపడ్డారు.
మరోవైపు గిరిజన యువతుల కోసం పెళ్లి కానుక తీసుకొస్తే దానిని కూడా జగన్ ప్రభుత్వం తొలగించిందని మండిపడ్డారు. తమ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలన్నీ తొలగించి వైసీపీ కార్యకర్తలకు ఇచ్చుకుంటున్నారని ఆరోపించారు. పన్నులు కట్టేది ప్రజలు, అనుభవించేది వైసీపీ నేతలు అంటూ చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు.
ఈ వార్తలు కూడా చదవండి
జగన్ 70 రోజుల పాలనకు రెఫరెండం ఆ 98 మంది బలిదానాలే : కాల్వ శ్రీనివాసులు
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 9, 2019, 4:06 PM IST