ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీజేపీ నేత జీవీఎల్ మండిపడ్డారు. చంద్రబాబు నిర్వాకం వల్లే పోర్టు ఆగిపోయిందని ఆరోపించారు.  శుక్రవారం ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలంలోని రామాయపట్నం పోర్టు ఏరియాను బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు నిర్వాకం వల్లే రామాయపట్నం పోర్టు ఆగిపోయిందని ఆరోపించారు. రామాయపట్నం ప్రతిపాదనలు పంపకుండా ఐదేళ్లు కాలయాపన చేశారని ఆయన అన్నారు. చంద్రబాబు తన సొంత ప్రయోజనాలు నెరవేరలేదనే కారణంతోనే... రామాయపట్నం, కనిగిమ్జ్ లను నిర్లక్ష్యం చేశారని అన్నారు. చంద్రబాబు మనుషులు ఇక్కడ భూములు కొనడమే దానికి కారణమని అన్నారు.