'మన్మథుడు-2' రివ్యూ..!
First Published Aug 9, 2019, 2:11 PM IST
గతంలో వచ్చిన హిట్ సినిమా ఇమేజ్ ని క్యాష్ చేసుకోవాలనుకున్నప్పుడు పుట్టే ఐడియానే సీక్వెల్. అయితే చాలా సీక్వెల్స్ ..అంతకు ముందు సినిమా ఎక్కడ ఆగిందో ...ఆ తర్వాత వారి జీవితంలో ఏం జరిగింగో చెప్పటానికి ప్రయత్నిస్తూంటాయి.

(Review By---సూర్య ప్రకాష్ జోశ్యుల) గతంలో వచ్చిన హిట్ సినిమా ఇమేజ్ ని క్యాష్ చేసుకోవాలనుకున్నప్పుడు పుట్టే ఐడియానే సీక్వెల్. అయితే చాలా సీక్వెల్స్ ..అంతకు ముందు సినిమా ఎక్కడ ఆగిందో ...ఆ తర్వాత వారి జీవితంలో ఏం జరిగింగో చెప్పటానికి ప్రయత్నిస్తూంటాయి. మరికొన్ని టైటిల్ సీక్వెల్ అంటే కేవలం టైటిల్ కు మాత్రమే సీక్వెల్ ఉంటుంది. అంతకు మించి మొదట సినిమాతో ఈ సీక్వెల్ కు ఏ సంభందం ఉండదు. అలాంటి టైటిల్ సీక్వెల్ సినిమానే `మన్మథుడు-2` . ఫ్రెంచ్ లో వచ్చి విజయవంతమైన I Do (2006) సినిమా రీమేక్ గా రూపొందిన ఈ సినిమా ఎంతవరకూ మన ప్రేక్షకులను ఆకట్టుకుంది. `మన్మథుడు-2` అని టైటిల్ పెట్టడానికి కారణం వేరే ఏమైనా ఉందా.... త్రివిక్రమ్ స్దాయిలో జోక్స్ ని ఈ సినిమా నుంచి ఎక్సపెక్ట్ చేయచ్చా... వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథ ఏంటి..? సాంబశివరామ్ ఉరఫ్ సామ్ (నాగార్జున) పోర్చుగల్ లో సెటిలైన ఓ తెలుగు ఫ్యామిలికి చెందిన వాడు. ఫ్లాష్ బ్యాక్ లో తన లవ్ ఫెయిల్యూరు అవటంతో ప్లే బోయ్ గా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూంటాడు. ఆ కాన్సెప్టులో భాగంగా ప్రేమ, పెళ్లి వంటివాటికి దూరంగా ఉంటాడు. జీవితంలో ఎప్పటికి పెళ్లి చేసుకోకూడదు అని డిసైడ్ అతనికి తన తల్లి, కుటుంబ వ్యక్తుల పట్టుదలతో పెళ్లికి ఓకే అనాల్సి వస్తుంది. అయితే పెళ్లి చేసుకోవటం ఇష్టం ఉండదు. ఇంట్లో వాళ్లని నొప్పించకూడదు...తను సఫర్ అవకూడదు అని ఓ మాస్టర్ ప్లాన్ వేస్తాడు. అవంతిక(రకుల్ ప్రితి సింగ్) అనే అమ్మాయిని ..గంటకు ఇంత అని మాట్లాడి తన గర్ల్ ఫ్రెండ్ గా నటించటానికి తన ఇంటికి తీసుకు వస్తాడు. అక్కడ నుంచి ఏం జరిగింది. మెల్లి మెల్లిగా అవంతికతో సామ్ ఎలా ప్రేమలో పడ్డాడు... వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?