తాజాగా సినీ నటుడు రాజేంద్రప్రసాద్ పృథ్వీకి కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన రాజేంద్రప్రసాద్ 'సీఎంని వెంటనే కలవడానికి సినీ నటులేం వ్యాపారవేత్తలు కాదు.. కళాకారులు సీఎంని కలవాలన్న నిబంధన ఏమీ లేదని' రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించడం విశేషం.
ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ఎన్నికవ్వడం సినీ పరిశ్రమకి ఇష్టం లేదని.. అందుకే ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఎవరూ వెళ్లి మర్యాదపూర్వకంగా కలవలేదని ఎస్వీబీసీ చైర్మన్, సినీ నటుడు పృథ్వీ కొన్ని కామెంట్స్ చేశాడు. పృథ్వీ చేసిన ఆరోపణలను ఇప్పటికే వైసీపీలో ఉన్న సినీ నటుడు పోసాని కృష్ణమురళి తప్పుబట్టాడు.
తాజాగా సినీ నటుడు రాజేంద్రప్రసాద్ కూడా పృథ్వీకి కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన రాజేంద్రప్రసాద్ 'సీఎంని వెంటనే కలవడానికి సినీ నటులేం వ్యాపారవేత్తలు కాదు.. కళాకారులు సీఎంని కలవాలన్న నిబంధన ఏమీ లేదని' రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించడం విశేషం.
జగన్ సీఎంగా సెటిల్ అయిన తరువాత కలుస్తామని తెలిపారు. జగన్ తో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని.. రెండు రాష్ట్రాల సీఎంలు సినీ పరిశ్రమ పట్ల సానుకూలంగా ఉన్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రజలకు తాగునీరందించే ముఖ్యమంత్రి తమకు దేవుడని రాజేంద్రప్రసాద్ అన్నారు. జగన్ ని రేపు కలవాల్సివుందని కానీ ఇతర కారణాల వలన మరో రెండు మూడు రోజుల్లో కలవడానికి అవకాశమిచ్చారని రాజేంద్రప్రసాద్ చెప్పారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 9, 2019, 2:38 PM IST