అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలు రైతుల పాలిట శాపంగా మారిందని ఆరోపించారు మాజీమంత్రి కాలువ శ్రీనివాసులు. జగన్ నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్ లో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ విమర్శించారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపుగా 98 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. రైతుభరోసా పథకాన్ని నిలిపివేయడం, రైతులకు ఇవ్వాల్సిన రుణాలు ఇవ్వకపోవడం వల్లే రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడ్డారని చెప్పుకొచ్చారు. 

ప్రస్తుత ప్రభుత్వంలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 70 రోజుల్లోనే 98 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే పాలన ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని విమర్శించారు. 

రైతుల విషయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అన్నదాత తల్లడిల్లిపోతున్నాడని ఆరోపించారు. ఫలితంగా ఆందోళనతో అన్నదాతలు అర్థాంతరంగా అసువులు బాస్తున్నారని కాలువ శ్రీనివాసులు విమర్శించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ లా నాడు వైయస్ కూడా చేయలేదు : అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు