ఎంత చిన్న సినిమా తీసినా అనుకున్న పాయింట్ ని ఎలాంటి తప్పులు లేకుండా ప్రజెంట్ చేయగలిగితే అవకాశాలు వాటంతట అవే వస్తాయి. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ విషయాన్నీ మరోసారి గుర్తు చేశాడు. అతను చేసిన మొదటి సినిమాకు స్క్రీన్ ప్లే విభాగంలో జాతీయ అవార్డు లభించింది. 

తన రెండవ సినిమా రిలీజ్ రోజే ఆ అవార్డు దక్కడం వెరీ స్పెషల్ అని చెప్పాలి. రాహుల్ రవీంద్రన్ మొదట సుశాంత్ హీరోగా చిలాసౌ అనే సినిమాను తెరకెక్కించాడు. ఎలాంటి హడావుడి చేయకుండా సింపుల్ గా రిలీజైన ఆ సినిమా పాజిటివ్ టాక్ తో పెట్టిన పెట్టుబడిని వెనక్కి తేవడమే కాకుండా ఓ రూపాయి లాభాన్ని అందించింది. 

ఆ సినిమాలో స్క్రీన్ ప్లే క్లిక్కవ్వడంతో సినిమాకు జాతీయ స్థాయిలో గౌరవం దక్కింది. బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డును చిలసౌ సినిమాకు దక్కడం స్పెషల్ అని చెప్పవచ్చు. ఇకపోతే ఇదే రోజు మన్మథుడు 2 కూడా రిలీజ్ అవ్వడం రాహుల్ కి ఇది ఫుల్ హ్యాపీ మూమెంట్. మన్మథుడు 2 అసలు రిజల్ట్ ఏంటో తెలియాలంటే మరోక రోజు వెయిట్ చేయాల్సిందే.

జాతీయ పురస్కారాలు.. ఉత్తమ తెలుగు చిత్రం 'మహానటి', ఉత్తమ నటి కీర్తి సురేష్!