Asianet News TeluguAsianet News Telugu

జాతీయ అవార్డుల్లో 'రంగస్థలం'కు నిరాశ.. నార్త్ లాబీయింగ్!

66వ జాతీయ చలన చిత్ర వార్డులని 2018 సంవత్సరానికి గాను కొద్ది సేపటి క్రితమే ప్రకటించారు. ఉత్తమ చిత్రంగా గుజరాతీ చిత్రం 'హెల్లరో' జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. ఉత్తమ దర్శకుడిగా 'ఉరి' చిత్రాన్ని గాను ఆదిత్య ధార్ కి అవార్డు దక్కింది. ఉత్తమ నటిగా మహానటి చిత్రానికి గాను కీర్తి సురేష్ జాతీయ అవార్డు కైవసం చేసుకోవడం విశేషం. 

Ram Charan fans disappointed with National Awards
Author
Hyderabad, First Published Aug 9, 2019, 5:12 PM IST

66వ జాతీయ చలన చిత్ర వార్డులని 2018 సంవత్సరానికి గాను కొద్ది సేపటి క్రితమే ప్రకటించారు. ఉత్తమ చిత్రంగా గుజరాతీ చిత్రం 'హెల్లరో' జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. ఉత్తమ దర్శకుడిగా 'ఉరి' చిత్రాన్ని గాను ఆదిత్య ధార్ కి అవార్డు దక్కింది. ఉత్తమ నటిగా మహానటి చిత్రానికి గాను కీర్తి సురేష్ జాతీయ అవార్డు కైవసం చేసుకోవడం విశేషం. 

అలాగే ఉత్తమ తెలుగు చిత్రంగా కూడా మహానటి మరో అవార్డుని దక్కించుకుంది. ఇక గత ఏడాది విడుదలైన రాంచరణ్ రంగస్థలం చిత్రం అఖండ విజయం సాధించింది. ఈ చిత్రంలో రాంచరణ్ నటన, సుకుమార్ దర్శత్వం, ఆర్ట్ డైరెక్షన్ కు ప్రశంసలు దక్కాయి. జాతీయ అవార్డుల విషయంలో చిత్ర యూనిట్ కూడా కాన్ఫిడెంట్ గానే ఉంది. 

కానీ రంగస్థలం చిత్రానికి కేవలం బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగంలో అవార్డు ఇచ్చి సరిపుచ్చారు. దీనితో రాంచరణ్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. జాతీయ అవార్డులపై అప్పుడే ట్రోలింగ్ కూడా మొదలైంది. జాతీయ అవార్డుల ఎంపికలో నార్త్ చిత్రాల లాబీయింగ్ స్పష్టంగా కనిపిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. 

ఇక గత ఏడాది విడుదలైన చిలసౌ, అ! కూడా జాతీయ అవార్డులు దక్కించుకున్నాయి. ఉత్తమ నటుడు విభాగంలో ఉరి చిత్రానికి విక్కీ కౌశల్, అంధాధున్ చిత్రానికి ఆయుష్మాన్ ఖురానా ఇద్దరూ జాతీయ అవార్డు గెలుచుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios