మనం చేసే పనిపట్ల కమిట్మెంట్ తో ఉంటేనే సక్సెస్ అందుకోగలం. అలా కమిట్మెంట్ తో గొప్ప స్థానాలకు ఎదిగిన వారు చాలా మంది ఉన్నారు. అయితే వారి జీవితాల్లో జరిగే కొన్ని సంఘటనల వలన పనిని పక్కన పెట్టకుండా నిబద్ధతతో ఉండేవారు మాత్రం చాలా అరుదు. 

ప్రముఖ ఇండియన్ క్రికెటర్ సచిన్ తన తండ్రి మరణించిన మరుసటి రోజే టీమ్ కోసం గ్రౌండ్ లోకి దిగి ఆడాడు. రీసెంట్ గా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా తమ తండ్రి హరికృష్ణ మరణంతో షాక్ తిన్నారు. కానీ తమ పనిని నిర్లక్ష్యం చేయలేదు. తండ్రి పోయాడనే బాధ ఉన్నప్పటికీ అంత్యక్రియలు పూర్తి చేసి ఎప్పటిలానే షూటింగ్ లో పాల్గొన్నారు. 

సినిమా వేదికపై తమ తండ్రి నేర్పిన కమిట్మెంట్ గురించి గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే సినీ జంట సుమ, రాజీవ్ కనకాలకు ఎదురైంది. ఇటీవల నటగురువు దేవదాస్ కనకాల మరణించిన సంగతి తెలిసిందే. ఆయన కొడుకు రాజీవ్, కోడలు సుమ కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

దేవదాస్ గారి మరణం తరువాత అంత్యక్రియలను పూర్తి చేసి మూడు రోజుల్లో ఇద్దరూ తిరిగి తమ పనుల్లో యథావిధిగా పాల్గొంటున్నారు. ఇంకొన్ని రోజులు గ్యాప్ తీసుకుంటే వీరికి ఎలాంటి  సమస్యలు ఉండవు కానీ వారి కారణంగా ఇతరులు ఇబ్బంది పడకూడదని కమిట్ అయిన షోలను, ప్రాజెక్ట్ లను పూర్తి చేసే పనిలో పడ్డారు.