ఈ ఏడాది ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న చిత్రాల్లో 'సాహో', 'సై రా'లు ముందు లిస్ట్ లో ఉంటాయి. ఈ నెలాఖరున 'సాహో' రిలీజ్ ఉండడంతో ఇప్పటినుండే హడావిడి మొదలైంది. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేశారు. రేపు సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక 'సాహో' సినిమా థియేటర్లలో 'సై రా' హడావిడి చేయబోతుందని సమాచారం. 'సాహో' సినిమాను ప్రదర్శించే థియేటర్లలో 'సై రా' ట్రైలర్ ని ప్రసారం చేయాలని చిత్రబృందం భావిస్తోందట. అన్ని థియేటర్లలో ఇంటర్వెల్ సందర్భంగా 'సై రా' ట్రైలర్ ని ప్రదర్శించబోతున్నారట. 

'సై మా' అవార్డుల వేడుకలో భాగంగా 'సై రా' థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అక్కడ లాంఛనంగా ట్రైలర్ రిలీజ్ చేసి ఆ తరువాత 'సాహో' థియేటర్లలో ట్రైలర్ ని ప్రదర్శించాలని అనుకుంటున్నారు. 'సాహో' సినిమా థియేటర్ లో మాములుగానే హంగామా ఓ రేంజిలో ఉంటుంది.

ఇక ఆ సినిమా మధ్యలో చిరు సినిమా ట్రైలర్ వస్తే ఇక థియేటర్ లో అభిమానుల రచ్చ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. 'సై రా' చిత్రాన్ని గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దానికి నెల రోజుల ముందే ట్రైలర్ ని లాంచ్ అవుతుందన్నమాట. ప్రస్తుతం 'సై రా' పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.