మహానటి సావిత్రి జీవిత ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' సినిమా అందించిన విజయం చిత్ర యూనిట్ లో ప్రతి ఒక్కరి కెరీర్ కు యూ టర్న్ అనే చెప్పాలి. జాతీయ అవార్డులను అందుకొని మహానటి ఖ్యాతిని మరింత పెంచుకుంది. ఈ సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ మరో స్థాయికి చేరుకుంది. 

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటి సినిమాలో సావిత్రి పాత్రకు మొదట కీర్తి సురేష్ ని అనుకోలేదు. ఎలాగైనా నిత్య మీనన్ తోనే సినిమా చేయాలనీ దర్శకుడు స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినప్పటికీ ఆమె ఒప్పుకోలేదు. చేయనని మొహం మీదే చెప్పేసింది. అయితే కీర్తి సురేష్ కి కథ చెప్పినప్పుడు మొదట ఆలోచించినప్పటికీ ఆ తరువాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

ఆమె కాకుండా వేరేవాళ్లు నటించి ఉంటె సినిమా అందరికి ఇంతలా కనెక్ట్ అయ్యి ఉండేది కాదేమో.. మొత్తానికి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకొని కీర్తి నేషనల్ లెవెల్లో గుర్తింపు అందుకుంది. మహానటికి ముందు వరకు నార్మల్ హీరోయిన్ గా ఉన్న కీర్తి ఆ సినిమా అనంతరం ఒక్కసారిగా నేషనల్ లెవెల్లో గుర్తింపు దక్కించుకుంది. 

మహానటి తరువాతే ఆమెకు బాలీవూడ్ ఆఫర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఇక ఇప్పుడు బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కడంతో అవకాశాల డోస్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. ఇక ఉత్తమ తెలుగు చిత్రానికి గాను అలాగే ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ విభాగాల్లో మహానటికి జాతీయ అవార్డులను ప్రకటించారు.