ఒంగోలు: ప్రకాశం జిల్లా మోచర్ల వద్ద శుక్రవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా కరీంనగర్ జిల్లాకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు.

కరీంనగర్ జిల్లాకు చెందినవారు తిరుపతికి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఆగి ఉన్న లారీని కారు వెనుక నుండి ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న చిన్నారిని కావలి ఆసుపత్రికి తరలించారు. ఈ చిన్నారి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

ఈ కారులో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఒక చిన్నారి మినహా కారులో ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.