ఏపీ రాష్ట్ర మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్.. ట్విట్టర్ వేదికగా మరోసారి విమర్శల వర్షం కురిపించారు. అధికార వైసీపీ పులివెందల పంచాయితీ చేస్తోందంటూ సెటైర్లు వేశారు. కియాలాంటి అంతర్జాతీయ సంస్థనే ఈ రేంజ్ లో బెదిరిస్తున్నారంటే, స్థానిక పెట్టుబడిదారులను మీ జే ట్యాక్స్ కోసమెలా వణికిస్తున్నారో అర్థమౌతోందంటూ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

‘‘కియా లాంటి అంతర్జాతీయ సంస్థనే ఈ రేంజ్ లో బెదిరిస్తున్నారంటే, స్థానిక పెట్టుబడిదారులను మీ జే ట్యాక్స్ కోసం ఎలా వణికిస్తున్నారో అర్థమౌతోంది. మీకు వీలైతే నాలుగు కంపెనీలకు రాష్ట్రానికి తీసుకురండి. అంతేకానీ మా కష్టంతో తెచ్చిన కంపెనీలను మీ పులివెందల పంచాయతీతో బెదిరించి తరిమేయకండి ’’ అని లోకేష్ ట్వీట్ చేశారు. పక్కన హ్యాష్ ట్యాగ్ తో సారీ కియా అని జత చేశారు.

మరో ట్వీట్ లో ‘‘ మీ దౌర్జన్యాలకు బెదిరి, వాళ్లు వెళ్లి మోదీగారి దగ్గర పంచాయతీ పెడితే, మొన్న ఢిల్లీలో ఉండి సంజాయిషీ ఇచ్చుకున్నట్లుగా మళ్లీ ఢిల్లీ పరుగెత్తాల్సి ఉంటుంది. అయినా మీ నాయనగారికి ఇచ్చిన మాట కోసం కియా వాళ్లిక్కడ ప్లాంటు పెట్టారని చెప్పుకుంటూ ఈ దాడులేంటండీ జగన్ గారు’’ అని లోకేష్ సెటైర్లు వేశారు.