వరంగల్ లో తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన ప్రవీణ్ కి వరంగల్ న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. కేవలం ఘటన జరిగిన 48 రోజుల్లో న్యాయస్థానం ఈ కేసులో తీర్పు వెలువరిచింది. అలాంటి నీచుడికి సరైన శిక్ష విధించారంటూ ప్రజలు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా... నిందితుడు ప్రవీణ్ కి పిడో ఫిలియా అనే జబ్బు ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ జబ్బు ఉన్నవారికి సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటాయని వారు చెబుతున్నారు. మరీ ముఖ్యమంగా చిన్న పిల్లలను చూస్తే అసలు ఆపుకోలేరని.. వారిపై అకృత్యాలకు పాల్పడుతూ ఉంటారని చెబుతున్నారు.

ఇక ప్రవీణ్ గురించి స్థానికులు మాట్లాడుతూ... అతను ఓ సెక్స్ ఉన్మాది అని చెబుతున్నారు. ఆడవాళ్ల చీరలు బయట తీగలపై ఆరేసి ఉన్నా.. వాటి వాసన చూసి కూడా ఉద్రేకానికి లోనయ్యేవాడని చెబుతున్నారు. ప్రతి నిమిషం సెక్స్ కోసం పరితపిస్తాడని చెప్పారు.  సెక్స్ కోరిక తీర్చుకోవడం కోసం నానా రకాలుగా ప్రవర్తించేవాడని వారు అంటున్నారు.

ఇంటి కిటీకిల్లో నుంచి నిద్రపోతున్న మహిళలపై సిరంజితో నీళ్లు పోసేవాడని...  నీళ్లు పడి తడిచిన దుస్తులను ఆడవాళ్లు సరిచేసుకుంటుంటే... చూసి వికృతానందం పొందేవాడు. మొదటి నుంచి అతినిది నేర స్వభావం కలిగిన మనస్తత్వమని పోలీసులు చెబుతున్నారు. గతంలో చైన్ స్నాచింగ్ కేసులో జైలు పాలయ్యాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

పెళ్లి చేసుకున్నా కూడా అతనిలో ఎలాంటి మార్పు రాలేదని స్థానికులు చెబుతున్నారు.  అర్థరాత్రి దాటాక గానీ ఇంటికి చేరేవాడు కాదు. ప్రశ్నించిన భార్యతో గొడవ పడేవాడని స్థానికులు చెప్పారు. ఓసారి రాత్రి వేళ అసభ్యంగా ప్రవర్తించాడని స్థానికులు అతనిని చితకబాదిన సంఘటనలు కూడా ఉన్నాయని పోలీసులు దర్యాప్తులో తేలింది.