శ్రావణ శుక్రవారం పండగ వేళ మంచు వారి కుటుంబంలో మహాలక్ష్మి పుట్టింది. మంచు విష్ణు సతీమణి విరానికా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మంచు విష్ణు ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

ఇప్పటికే విష్ణు దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరిలో అవియానా, వివియానా కవలలు కాగా కొడుకు అవ్రమ్ ఉన్నాడు. ఇప్పుడు మంచు విష్ణు మరోసారి తండ్రి కావడంతో  సోషల్ మీడియాలో సినిమా ప్రముఖులతో పాటు అభిమానుల నుంచి విష్ణుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే కొందరు నెటిజన్లు మాత్రం విష్ణుపై సెటైర్లు వేస్తున్నారు. 'ఇప్పటికైనా రిటైర్మెంట్ ఇస్తావని కోరుకుంటున్నా.. మీకు పిల్లలు కావాలంటే ఎవరినైనా దత్తత' తీసుకోండి అని కొందరు ట్వీట్లు చేస్తుంటే.. మరికొందరు 'నెక్స్ట్ రౌండ్ ఎప్పుడు మొదలుపెడతావని' అడుగుతున్నారు.