దక్షిణాది రాష్ట్రాలను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర కర్ణాటకలో భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలు  నానా అవస్థలు పడుతున్నారు. కనీస సదుపాయాలు కూడా లభించక తిప్పలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో... వరద బాధితులను ఆదుకునేందుకు సువర్ణ న్యూస్ ముందుకు వచ్చింది. ఏషియా నెట్ న్యూస్ బ్యానర్ కింద వరద బాధితులకు సహాయం చేందుకు సువర్ణ న్యూస్ ముందుకు వచ్చింది.

ఉత్తర కర్ణాటక, మలాండ్ ప్రాంతాల్లో వరద ఉధృతి అధికంగా ఉంది. బాధితులు సహాయం చేసేవారి కోసం ఎదురుచూస్తున్నారు. కనీసం తినడానికి ఆహారం, తాగడానికి మంచినీరు కూడా లభించని స్థితిలో బాధితులు ఇబ్బందులుపడుతున్నారు. దీంతో.. సువర్ణ న్యూస్ యాజమాన్యం.. వరద బాధితులను ఆదుకునేందుకు సహాయ నిధి ఏర్పాటు చేసింది.

ప్రత్యేకంగా ఏషియా నెట్ బ్యానర్ పేరిట ఓ వాహనాన్ని ఏర్పాటు చేసి దానిలో వరద బాధితులకు అవసరమైన ఆహారం, నీరు, దస్తులు లాంటివి సరఫరా చేస్తున్నారు.  స్థానిక ప్రజలు ఎవరైనా సహాయం చేయాలని అనుకుంటే.. సువర్ణ న్యూస్ కార్యాలయం వద్ద అందజేసే అవకాశం ఉంది. ఈ సేకరించిన వాటన్నింటినీ.. వరద బాధితులకు అందజేయనున్నట్లు వారు చెప్పారు.