బిగ్ బాస్ హౌస్ లో పునర్నవి, రాహుల్ ల మధ్య సాగే సంభాషణలు యూత్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల పునర్నవిని డేట్ కి వస్తావా..? అని అడిగాడు రాహుల్. దానికి ఆమె తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి తెలుసుకోమని చెప్పి రాహుల్ తో కాసేపు ఆదుకుంది. తాజాగా వీరిద్దరి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బిగ్ బాస్ మెయిన్ ఎపిసోడ్ లో చూపించని కంటెంట్ తో బిగ్ బాస్ బజ్ అంటూ స్టార్ మ్యూజిక్ లో ఓ కార్యక్రమం ప్రసారమవుతోంది. అందులో రాహుల్, పునర్నవిల ముచ్చట హైలైట్ గా నిలిచింది. ఆ వీడియోలో పునర్నవితోరాహుల్.. బయటకు పోయిన తర్వాత ఒక రింగ్ ఇచ్చి నీకు ప్రపోజ్ చేస్తే ఏమంటావని ప్రశ్నించాడు.

దానికి ఆమె ఫస్ట్ నేనేంటో తెలుసుకోఅంటూ బదులిచ్చింది. నేను జోక్ గానే అడుగుతున్న సీరియస్ గా తీసుకోకుండా ఒకవేళ రింగ్ ఇచ్చి ప్రపోస్ చేస్తే ఏం చేస్తావు చెప్పు అంటూ మరోసారి ప్రశ్నించాడు. దానికి పునర్నవి ''పో.. పోయి పని చూసుకో'' అంటూ సమాధానం చెబుతానని వెల్లడించింది.

పునర్నవి సరదాగా.. తన కాలితో రాహుల్ ని తన్నినా అతడు దాన్ని చాలా లైట్ గా తీసుకున్నాడు. వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం చూస్తుంటే హౌస్ లో ఎక్కువ సేపు  మాట్లాడుకుంటున్నారని తెలుస్తోంది. కానీ మెయిన్ ఎపిసోడ్ లో ఆ సన్నివేశాలను చూపించడం బిగ్ బాస్ కి కుదరడం లేదనుకుంటా.. అందుకే బిగ్ బాస్ బజ్ లో ప్లే చేస్తున్నారు.