సెమీస్ కు వానముప్పు: మరిన్ని వార్తలు

By rajesh yFirst Published Jul 8, 2019, 6:46 PM IST
Highlights

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

భారత్- న్యూజిలాండ్ మ్యాచ్ కి మరోసారి వర్షం ముప్పు

ప్రపంచకప్ లో టీం ఇండియా సెమీఫైనల్స్ కి చేరుకుంది. మాంచెస్టర్‌లోని ప్రఖ్యాత ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ మైదానంలో మంగళవారం ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ ప్రపంచకప్‌లో భారత్‌-కివీస్‌ మధ్య ఇదే తొలిపోరు కానుంది. లీగ్‌ దశలో గత నెల 13న నాటింగ్‌హామ్‌లో జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండానే రద్దైన సంగతి తెలిసిందే.
 

 

తానా సభలా..టీడీపీ భజనా సభలా: రామ్‌మాధవ్‌కు అవమానంపై కన్నా ఫైర్

తానా సభల్లో బీజేపీ నేత రాంమాధవ్‌ను అవమానించడంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ  ఘాటుగా స్పందించారు. అవి తానా సభలు కాదని.. టీడీపీ భజన సభలంటూ సెటైర్లు వేశారు.
 

 

ధోనీ ఖాతాలో చెత్త రికార్డ్

టీం ఇండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ధోనీ ఖాతాలో ఓ చెత్త రికార్డ్ నమోదైంది. ఇప్పటికే ఈ ప్రపంచకప్ లో ధోనీ ఆట తీరు సరిగా లేదంటూ పలువురు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. 

 

 

సెమీస్, ఫైనల్లోనూ అతడిదే హవా...వరల్డ్ కప్ ట్రోఫీ టీమిండియాదే: కృష్ణమాచారి శ్రీకాంత్

టీమిండియా బౌలర్ జస్ప్రీత్ సింగ్ బుమ్రాపై మాజీ ఆటగాడు కృష్ణమాచారి  శ్రీకాంత్ ప్రశంసలు కురిపించాడు. రేపు(మంగళవారం) జరగనున్న సెమీఫైనల్, ఆ తర్వాత ఫైనల్లోనూ అతడి హవా కొనసాగనుందని  జోస్యం చెప్పాడు.  

 

మేం భారత్ ను ఓడిస్తామని ఎవరూ నమ్మడం లేదు: న్యూజిలాండ్ కోచ్

టీమిండియాతో జరగనున్న సెమీఫైనల్ పోరుపై కివీస్ కెచ్ గ్యారీ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాాడు. అసలు తాము(కివీస్ టీం) టీమిండియాను ఓడించగలమని తమ అభిమానులే నమ్మడం  లేదని అన్నారు. 

 

ఆర్మీ ఆఫీసర్ గా మహేష్.. ఫోటో లీక్!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ షూటింగ్ లో మహేష్ బాబు కూడా జాయిన్ అయ్యాడు.

 

విజయనిర్మల చావుకి అసలు కారణమదే.. కృష్ణ కామెంట్స్!

ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె మరణంతో షాక్ లో ఉన్న కృష్ణ ఆ బాధ నుండి కోలుకోలేకపోతున్నారు. తన భార్యతో కృష్ణ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కృష్ణ చేసే ప్రతీ పనిలో ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉండేది.
 

 

నెటిజన్ కు ఘాటుగా బదులిచ్చిన తాప్సీ!

తెలుగులో పలు చిత్రాల్లో నటించిన తాప్సీ ఆ తరువాత బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యి అక్కడ వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. 

 

రమ్యాతో అమలాపాల్ లిక్‌లాక్.. ఫొటో వైరల్!

కోలీవుడ్ నటి అమలాపాల్ నటించిన 'ఆమె' సినిమా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల విడుదలైన టీజర్ లో అమలాపాల్ పూర్తిగా నగ్నంగా కనిపించి షాక్ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు.

 

రామ్ మాధవ్‌తో విభేదాలు: క్లారిటీ ఇచ్చిన మురళీధర్ రావు

పార్టీ నేత రామ్ మాధవ్‌తో తనకు విభేదాలు ఉన్నాయని సాగుతున్న ప్రచారంపై  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు స్పందించారు. ఈ విషయమై మీడియాలో  తప్పుడు ప్రచారం సాగుతోందన్నారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. 
 

 

రౌడీ హీరో ఎమోషనల్ స్పీచ్.. ఫ్యాన్స్ షాక్!

విజయ్ దేవరకొండ స్టేజ్ పై ఉంటే ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అభిమానులు విజయ్ మాటలు వింటూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ మొదటిసారి ఈ రౌడీ హీరో స్టేజ్ పై కన్నీరు పెట్టుకున్నాడు. తమ్ముడు తన ఫ్యామిలీ కోసం ఎంతో చేశాడని కానీ మొదటిసారి వాడు పడుతున్న కష్టానికి తాను కొంత కూడా హెల్ప్ చేయలేకపోయానని భావోద్వేగానికి లోనయ్యాడు. 
 

 

ఓ బేబీ సక్సెస్.. కన్ఫ్యూజన్ లో సమంత!

టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సమంత ఓ బేబీ సినిమాతో మరో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకుంది. మహానటి - రంగస్థలం - మజిలీ సినిమాలతో అక్కినేని కోడలి స్టార్ డమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక ఇప్పుడు ఓ బేబీ సక్సెస్ తో సమంత అన్ని వర్గాల ప్రేక్షకుల మనసును దోచుకుంటోంది

 

షమీ ముస్లిం అనే... పాక్ క్రికెట్ విశ్లేషకుల వక్ర బుద్ధి

పాక్ క్రికెట్ విశ్లేషకులు వక్ర బుద్ధి బయటపెట్టారు. టీం ఇండియా క్రికెటర్ షమీ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. షమీ ముస్లిం కాబట్టే.. అతనిని మ్యాచ్ కి దూరం పెట్టారని పాక్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇంతకీ మ్యాటరేంటంటే...  ఇటీవల టీం ఇండియా, శ్రీలంక మ్యాచ్ లో షమీని పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. అయితే.. అతను ముస్లిం కాబట్టే.. పక్కన పెట్టేశారని వ్యాఖ్యానించారు.
 

 

రోహిత్ కన్నా ముందే ఐదు శతకాలు బాదాడు: 64 ఏళ్ల క్రితమే

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ప్రస్తుత ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు బాదడంతో అభిమానులు, మాజీ క్రికెటర్లు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు చేసి సంగక్కర పేరిట ఉన్న రికార్డును హిట్ మ్యాన్ చేరిపేసి... ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు.

 

హిట్ మ్యాన్ ఐదు సెంచరీలు... కెప్టెన్ కోహ్లీ స్పెషల్ ఇంటర్వ్యూ

ఐదు సెంచరీలు చేయడంపై మీ స్పందన ఏమిటని కోహ్లీ... రోహిత్ ని అడిగాడు. ‘క్రికెటర్‌గా మేం గతాన్ని పట్టించుకోం. ప్రస్తుతం జరిగేదే మాకవసరం. ఇప్పుడు నేనూ అదే చేస్తున్నాను. ప్రస్తుత పరిస్థితి, ఫామ్‌ కొనసాగడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టాను. బ్యాటింగ్‌లో జట్టును ఇలా ముందుండి నడిపించాలని ఆశిస్తున్నా. ఈ ప్రపంచకప్‌ ముఖ్యమైన టోర్నమెంట్‌. ఇందులో జట్టు రాణించడం బాగుంది. ఓ టాపార్డర్‌ బ్యాట్స్‌మన్‌గా, ఓపెనర్‌గా నా బాధ్యతేంటో నాకు తెలుసు. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై సెంచరీ కొట్టాక... ఇకపై కూడా ఇలాంటి ప్రదర్శనే కనబరచాలని భావించాను’ అని అన్నాడు. 
 

 

ప్రపంచ కప్ 2019: ఆస్ట్రేలియాకు మరో షాక్

శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన వరల్డ్‌కప్‌ చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఖవాజా తొడ కండరాలు పట్టేశాయి. దాంతో అతను మిగిలి ఉన్న ప్రపంచ కప్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదని లాంగర్‌ చెప్పాడు.  ఖవాజాకు మూడు నుంచి నాలుగు వారాల విశ్రాంతి అవసరమని, దాంతో ఖవాజా వరల్డ్‌కప్‌ నుంచి వైదొలగాల్సి వచ్చిందని చెప్పాడు.

 

భార్య లేని సమయంలో అత్యాచారం.. కూతురిని తల్లిని చేసిన తండ్రి

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కన్నబిడ్డపైనే అత్యాచారానికి పాల్పడి ఆమెను గర్భవతిని చేశాడు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం అరుంధతిపేటకు చెందిన ఓ వ్యక్తి నిత్యం మద్యం సేవించి ఇంటికి వస్తుండటంతో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవి.
 

 

చంద్రబాబు ఖతం, మేమే ప్రతిపక్షం: బీజేపీ నేత మురళీధర్ రావు

ఏపీలో తామే ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించనున్నట్టు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు చెప్పారు. వైఎస్ఆర్‌సీపీ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల తరపున ప్రశ్నిస్తామని ఆయన స్పష్టం చేశారు.

 

విద్యార్ధినులపై కీచకపర్వం, నెలసరి తెలుసుకుని జాగ్రత్తలు: ప్రోఫెసర్‌పై వేటు

విద్యాబుద్ధులు చెప్పాల్సిన అధ్యాపకుడే... విద్యార్ధినుల పట్ల కీచకుడిగా మారాడు. అతని రాసలీలలు వెలుగులోకి రావడంతో కీచక అధ్యాపకుడిని విధుల్లోంచి తొలగించారు.  వివరాల్లోకి వెళితే... నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీలో కెమిస్ట్రీ హెచ్‌ఓడీగా పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ రవి రాసలీలలు అన్నీ ఇన్నీ కావు.
 

 

రాంప్రసాద్ హత్య: పోలీసులు అదుపులో కోగంటి సత్యం అల్లుడు

పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో పారిశ్రామికవేత్త కోగంటి సత్యం అల్లుడు కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతనిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు
 

 

సార్సా ఘటనలో కొత్త ట్విస్ట్: ఎప్ఆర్వో అనితపై కేసు నమోదు

రం రోజుల క్రితం మండలంలోని సార్సాల గ్రామంలో మొక్కలు నాటేందుకు వచ్చిన ఎఫ్‌ఆర్వో అనిత, సిబ్బంది కులం పేరుతో దూషించి దాడి చేసినట్లు అదే గ్రామానికి చెందిన నాయిని సరోజ ఈసుగాం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని డిఎస్పీ చెప్పారు.
 

 

ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్.. సైలెంట్ గా ఇన్స్టాగ్రామ్ లోకి రాంచరణ్!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ అభిమానులకు గుడ్ న్యూస్. రాంచరణ్ సైలెంట్ గా ఎలాంటి హడావిడి లేకుండా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాని ఓపెన్ చేశాడు. ప్రస్తుతం సినీ సెలెబ్రెటీలు సామజిక మాధ్యమాలలో యాక్టివ్ గా ఉండడం కీలకంగా మారింది. 
 

 

షాకిస్తున్న ‘ఓ బేబీ’మూడు రోజుల కలెక్షన్స్!

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రధారిగా నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'ఓ బేబీ' . మొన్న శుక్రవారం (5వ తేదీన) ప్రేక్షకుల ముందుకు వచ్చిన  ఈ చిత్రం  కొరియన్ మూవీ 'మిస్ గ్రానీ'కి రీమేక్ గా తెరకెక్కింది.  రిలీజైన తొలి రోజు మార్నింగ్ షో కే  సూపర్ హిట్  టాక్ తెచ్చుకుంది. నటన పరంగా సమంత ఫుల్ మార్కులు కొట్టేసిందని అందరూ మెచ్చుకున్నారు. మౌత్ టాక్ కారణంగా ఈ సినిమా వసూళ్లు పెరుగుతూ వచ్చాయి. 
 

 

నన్ను తప్పుగా అర్ధం చేసుకున్నారు.. 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్ కామెంట్స్!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. సమంత, చిన్మయి, అనసూయ. గుత్తా జ్వాలా వంటి వారు సోషల్ మీడియా వేదికగా సందీప్ రెడ్డిపై మండిపడ్డారు. దీంతో సందీప్ స్పందించక తప్పలేదు. తన వ్యాఖ్యలను మీడియా తప్పుగా అర్ధం చేసుకుందని అన్నారు.
 

 

'బిగ్ బాస్ 3' లో హాట్ హీరోయిన్.. కుర్రాళ్లకు కిక్కే కిక్కు!

బిగ్ బాస్ 3 తెలుగు సీజన్... టీవీ తెరపైనే మోస్ట్ వెయిటింగ్ షో గా మారిన సంగతి తెలిసిందే.  ఈ షో  ఎప్పుడు మొదలవుతుందా అని కోట్ల మంది  అభిమానులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ షోకి... టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తుండటంతో ఓ రేంజిలో హైప్ క్రియేట్ అయ్యింది.  
 

 

సమంతకు అల్లు అర్జున్ స్పెషల్ గిఫ్ట్!

అక్కినేని సమంత పెళ్లి తరువాత సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. కమర్షియల్ సినిమాలు పక్కన పెట్టి సరికొత్త కథలను ఎన్నుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతుంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా తన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తోంది. 
 

 

సీన్ రివర్స్: బిజెపిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరికకు బ్రేక్ లు

కిషన్ రెడ్డి, లక్ష్మణ్ అభిప్రాయం తీసుకున్న తర్వాతనే, వారి నుంచి స్పష్టత వచ్చిన తర్వాతనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవాలని బిజెపి అధిష్టానం భావిస్తోంది. దానికి ప్రధాన కారణం వారిద్దరి అభ్యంతరమేనని అంటున్నారు. 

 

కాంగ్రెస్, టీడీపీలకే కాదు, టీఆర్ఎస్‌కు బీజేపీ ఎసరు

రెండు తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ నాయకత్వం పావులు కదుపుతోంది. తొలుత తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకొనే దిశగా ఆ పార్టీ నాయకత్వం వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. 

 

 

 

 

click me!