తెలుగులో పలు చిత్రాల్లో నటించిన తాప్సీ ఆ తరువాత బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యి అక్కడ వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. ఇటీవల 'గేమ్ ఓవర్' చిత్రంతో సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ మరో సినిమా సైన్ చేసింది.

దర్శకుడు అనుభవ్ సిన్హాతో సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఇలాంటి సినిమా కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నానని, ఇప్పుడు ఆ కల నెరవేరబోతుందని చెబుతూ ఆ దర్శకుడితో కలిసి దిగిన ఫోటోను అభిమానులతో షేర్ చేసుకొంది.

ఈ పోస్ట్ చూసిన ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ.. 'అభినవ్ సర్.. మీరు సినిమాలో తాప్సికి బదులు మరో నటిని ఎన్నుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం.. తాప్సికి అసలు నటించడమే రాదు' అని అన్నాడు.

ఇది చూసిన తాప్సి.. 'సారీ యార్.. ఇప్పుడేం చేయలేవ్.. ఎందుకంటే సినిమాకు ఆల్రెడీ సైన్ చేసేశాను. ఇప్పుడు అనుభవ్ సర్ నన్ను తీసేయాలని నిర్ణయించుకున్నా.. అది నేను జరగనివ్వను.. ఒక పని చెయ్.. నేను మరో సినిమాకు సైన్ చేసేలోపు ఆ సినిమాలో నన్ను ఎవరూ తీసుకోకుండా ఆపి చూడు' అని సవాల్ విసిరింది.