స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రధారిగా నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'ఓ బేబీ' . మొన్న శుక్రవారం (5వ తేదీన) ప్రేక్షకుల ముందుకు వచ్చిన  ఈ చిత్రం  కొరియన్ మూవీ 'మిస్ గ్రానీ'కి రీమేక్ గా తెరకెక్కింది.  రిలీజైన తొలి రోజు మార్నింగ్ షో కే  సూపర్ హిట్  టాక్ తెచ్చుకుంది. నటన పరంగా సమంత ఫుల్ మార్కులు కొట్టేసిందని అందరూ మెచ్చుకున్నారు. మౌత్ టాక్ కారణంగా ఈ సినిమా వసూళ్లు పెరుగుతూ వచ్చాయి. 

ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లో ఈ సినిమా 17 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. పోటీలో  పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో, ఈ వారం చివరి వరకూ ఈ సినిమా కలెక్షన్స్ పరంగా తన జోరును చూపించే అవకాశాలు వున్నాయి. 'రంగస్థలం' .. 'మజిలీ' తరువాత 'ఓ బేబీతో సమంతకి మరో హిట్ పడటంతో ఆమె  ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు.

అలాగే నిర్మాతలు   ఓ బేబీ చిత్రానికి పెట్టింది కేవలం 13 కోట్ల బడ్జెట్ మాత్రమే అని తెలుస్తోంది.వాటిలో  థియేటర్స్ రైట్స్ కే 10 కోట్లకు పైగానే వచ్చేసాయి. ఇంకా శాటిలైట్, డిజిటల్ రైట్స్ కి అదనంగా వచ్చాయి. మిగతాదంతా మిగులే లాభమే అని చెప్తున్నారు. ఏదైమైనా సమంత సీజన్ స్టార్టైంది.