అక్కినేని సమంత పెళ్లి తరువాత సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. కమర్షియల్ సినిమాలు పక్కన పెట్టి సరికొత్త కథలను ఎన్నుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతుంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా తన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తోంది. 

తాజాగా ఆమె నటించిన 'ఓ బేబీ' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో సమంత నటనకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. విమర్శకులు సైతం ఆమెను ప్రశంసిస్తున్నారు. 

సినీ నటుడు అల్లు అర్జున్ కూడా సమంతని పొగడ్తలతో ముంచెత్తారు. సమంత ప్రతిభను కొనియాడుతూ బన్నీ ఓ మొక్కని, గులాబీలను ఆమెకి కానుకగా పంపించాడు. సమంత కోసం చిన్న లెటర్ కూడా పంపించాడు.

''ఫోన్ కాల్, గులాబీలు.. వీటిని మించి అందుకునే అర్హత నీకుంది.. గొప్ప స్థాయికి ఎదిగావ్'' అంటూ ప్రశంసించాడు. సినిమా విషయానికొస్తే.. డెబ్బై ఏళ్ల వృద్ధురాలు.. పాతిక ఏళ్ల అమ్మాయిగా మారిన తరువాత ఏం జరిగిందనేదే కథ. ఇలాంటి ఓ డిఫరెంట్ స్టోరీలో సమంత కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ కనబరిచింది.