అమరావతి: పార్టీ నేత రామ్ మాధవ్‌తో తనకు విభేదాలు ఉన్నాయని సాగుతున్న ప్రచారంపై  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు స్పందించారు. ఈ విషయమై మీడియాలో  తప్పుడు ప్రచారం సాగుతోందన్నారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. 

ఆదివారం నాడు ఓ తెలుగు న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు స్పందించారు. తమ మధ్య ఎలాంటి అభిప్రాయభేదాలు లేవన్నారు.. తమ మధ్య పోటీకి కూడ అవకాశం లేదన్నారు.

ఇప్పటివరకు తామిద్దరం కూడ వేర్వేరు ప్రాంతాల్లో పనిచేసినట్టుగా ఆయన గుర్తు చేశారు. తమ మధ్య పోటీకి అవకాశమే లేదన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పనిచేయాలని  జాతీయ నాయకత్వం తమకు బాధ్యతలు అప్పగించిందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నేతలతో సంబంధాలు ఉన్నందున ఈ బాధ్యతలను తమ ఇద్దరికి అప్పగించారని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణలో రామ్ మాధవ్ పర్యటించినా... ఏపీలో తాను పర్యటించినా పార్టీలో చేరికలపై నేతలతో చర్చిస్తామని  ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు  తన పదవికాలం పూర్తైతే  స్వరాష్ట్రానికి వస్తే తనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు.గతంలో విద్యాసాగర్ రావు కరీంనగర్ నుండి పోటీ చేసిన సమయంలో కూడ  తాను ఈ ప్రాంతంలో  పార్టీ విజయం కోసం తాను పనిచేసినట్టుగా ఆయన గుర్తు చేశారు.