కోలీవుడ్ నటి అమలాపాల్ నటించిన 'ఆమె' సినిమా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల విడుదలైన టీజర్ లో అమలాపాల్ పూర్తిగా నగ్నంగా కనిపించి షాక్ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు.

ఇందులో అమలాపాల్ మందు తాగుతూ, సిగరెట్ కాలుస్తూ లిప్ లాక్ చేస్తూ చాలా బోల్డ్ గా కనిపించింది. సినిమాల్లో లిప్ లాక్స్ కామనే అయినప్పటికీ అమలాపాల్ తన సహనటి వీజే రమ్యని ముద్దుపెట్టుకోవడం చర్చకు దారి తీసింది. ట్రైలర్ లో ఈ సన్నివేశాన్ని పట్టిపట్టి చూస్తే కాని కనిపించదు.

అయితే ప్రేక్షకులు మాత్రం ఆ సీన్ ను స్క్రీన్ షాట్స్ తీసి మరీ వైరల్ చేస్తున్నారు. సౌత్ సినిమాల్లో లిప్ లాక్ సన్నివేశాలు సాధారణమైపోయాయి. కానీ అమ్మాయిలను అమ్మాయిలు ముద్దుపెట్టుకునే సీన్లు చాలా అరుదనే చెప్పాలి.

దీంతో అమలాపాల్ లిప్ లాక్ సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా జూలై 19న విడుదల కానుంది. ఎంఆర్ రత్న ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.