టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సమంత ఓ బేబీ సినిమాతో మరో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకుంది. మహానటి - రంగస్థలం - మజిలీ సినిమాలతో అక్కినేని కోడలి స్టార్ డమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక ఇప్పుడు ఓ బేబీ సక్సెస్ తో సమంత అన్ని వర్గాల ప్రేక్షకుల మనసును దోచుకుంటోంది. 

ఓ బేబీ సినిమాకు ప్రస్తుతం అందరూ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు  సమంత నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ సక్సెస్ తో సమంతలో ఒక అలజడి నెలకొన్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ తాను చేయబోయే సినిమాపై అభిమానులు మరింత అంచనాలు పెంచేసుకుంటారని, అప్పుడు డిఫరెంట్ కథలో ఎంచుకోవడం కష్టమని తెలిపింది. ఆ విధంగా ఈ సినిమా సక్సెస్ నాలో కొంత కన్ఫ్యూజన్ ని కలుగజేస్తోందని ఇప్పుడు హ్యాపీగా రిటైర్ అవ్వోచ్చేమో అని వివరణ ఇచ్చారు.

అయితే ఈ ఫీలింగ్ పాసింగ్ క్లౌడ్స్ లాంటిదని అంటూ  భవిష్యత్తులో కూడా మంచి ప్రాజెక్ట్స్ ని ఎంచుకోవడానికి ప్రయత్నిస్తానని అదే విధంగా అభిమానులకు నచ్చే విధంగా ప్రతి సినిమాలో బెస్ట్ పెర్ఫెమెన్స్ ఇస్తానని సమంత వివరణ ఇచ్చారు. ఇక ప్రస్తుతం సమంత 96 రీమేక్ లో నటిస్తోంది. అలాగే మన్మధుడు 2లో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనుంది.