గర్భం దాల్చిన యువకుడు: ల్యాబ్ యజమానికి ట్విస్టిచ్చిన బాధితుడు

Published : Jul 08, 2019, 06:03 PM IST
గర్భం దాల్చిన యువకుడు: ల్యాబ్ యజమానికి ట్విస్టిచ్చిన బాధితుడు

సారాంశం

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భిండ్ జిల్లా కూపా ప్రాంతంలోని  ఓ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ రిపోర్ట్ ఇచ్చిన ల్యాబ్‌ను ప్రస్తుతం సీజ్ చేశారు వైద్యాశాఖాధికారులు.  

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భిండ్ జిల్లా కూపా ప్రాంతంలోని  ఓ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ రిపోర్ట్ ఇచ్చిన ల్యాబ్‌ను ప్రస్తుతం సీజ్ చేశారు వైద్యాశాఖాధికారులు.

బిండ్ కు 12 కి.మీ దూరంలోని కూపాలో శ్యామ్ పాథాలజీ ల్యాబ్‌కు 40 ఏళ్ల యువకుడు  కొన్ని పరీక్షలు నిర్వహించుకొన్నాడు. జ్వరంతో బాధపడుతున్న యువకుడు వైద్యుల సూచన మేరకు మలేరియా, టైఫాయిడ్ పరీక్షలు చేయించుకొన్నాడు. ఈ ల్యాబ్ రిపోర్ట్ ను ఆ యువకుడు వైద్యుడికి ఇచ్చాడు.

ఈ రిపోర్టు చూసిన వైద్యుడు షాక్ కు గురయ్యాడు.  ఆ యువకుడు గర్భం దాల్చినట్టుగా ల్యాబ్ నిర్వాహకుడు రిపోర్టు ఇచ్చాడు. ఈ ల్యాబ్ రిపోర్టును బాధిత యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ రిపోర్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ల్యాబ్‌ విషయం  వైద్యాశాఖాధికారుల దృష్టికి వచ్చింది. ల్యాబ్‌ను సీజ్ చేయించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
 

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !