ప్రపంచకప్ చివరి అంకానికి చేరుకుంది. కాగా... ఈ వరల్డ్ కప్ లో టీం ఇండియా వైస్ కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డ్ ని సొంతం చేసుకున్నాడు.  కేవలం ఒకే ప్రపంచకప్ లో ఐదు సెంచరీలు చేసి రికార్డ్ సొంతం చేసుకున్నాడు.  కాగా... ఈ సందర్భంగా రోహిత్ శర్మని... టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పెషల్ ఇంటర్వ్యూ చేశాడు.

ఐదు సెంచరీలు చేయడంపై మీ స్పందన ఏమిటని కోహ్లీ... రోహిత్ ని అడిగాడు. ‘క్రికెటర్‌గా మేం గతాన్ని పట్టించుకోం. ప్రస్తుతం జరిగేదే మాకవసరం. ఇప్పుడు నేనూ అదే చేస్తున్నాను. ప్రస్తుత పరిస్థితి, ఫామ్‌ కొనసాగడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టాను. బ్యాటింగ్‌లో జట్టును ఇలా ముందుండి నడిపించాలని ఆశిస్తున్నా. ఈ ప్రపంచకప్‌ ముఖ్యమైన టోర్నమెంట్‌. ఇందులో జట్టు రాణించడం బాగుంది. ఓ టాపార్డర్‌ బ్యాట్స్‌మన్‌గా, ఓపెనర్‌గా నా బాధ్యతేంటో నాకు తెలుసు. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై సెంచరీ కొట్టాక... ఇకపై కూడా ఇలాంటి ప్రదర్శనే కనబరచాలని భావించాను’ అని అన్నాడు. 

అనంతరం తన మిత్రుడు యువరాజ్ సింగ్ పై ప్రశంసలు కురిపించాడు. ‘‘ యువీ నాకు పెద్దన్నలాంటివాడు. మేం ఎప్పుడు మాట్లాడుకున్నా క్రికెట్‌ గురించే! 2011 ప్రపంచకప్‌లో తను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడో నాకు వివరించాడు. ఓపిగ్గా ఆడటంపై దృష్టిపెట్టాలని సూచించాడు. ఇవన్నీ నాకిపుడు బాగా ఉపయోగపడ్డాయి’ అని రోహిత్‌ అన్నాడు.