Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచ కప్ 2019: ఆస్ట్రేలియాకు మరో షాక్

శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన వరల్డ్‌కప్‌ చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఖవాజా తొడ కండరాలు పట్టేశాయి. దాంతో అతను మిగిలి ఉన్న ప్రపంచ కప్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదని లాంగర్‌ చెప్పాడు.  ఖవాజాకు మూడు నుంచి నాలుగు వారాల విశ్రాంతి అవసరమని, దాంతో ఖవాజా వరల్డ్‌కప్‌ నుంచి వైదొలగాల్సి వచ్చిందని చెప్పాడు. 

Osman Khawaja injured and left the World Cup
Author
Birmingham, First Published Jul 8, 2019, 6:49 AM IST

బర్మింగ్‌హామ్‌: ప్రపంచ కప్ టోర్నమెంటులో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే గాయం కారణంగా షాన్‌ మార్ష్‌ టోర్నీ నుంచి వైదొలగగా, తాజాగా అదే జాబితాలో ఉస్మాన్‌ ఖవాజా చేరాడు. తొడ కండరాల నొప్పితో సతమవుతున్న ఉస్మాన్‌ ఖవాజా వరల్డ్‌కప్‌ నుంచి నిష్క్రమించినట్లు ఆసీస్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ తెలిపాడు. 

శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన వరల్డ్‌కప్‌ చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఖవాజా తొడ కండరాలు పట్టేశాయి. దాంతో అతను మిగిలి ఉన్న ప్రపంచ కప్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదని లాంగర్‌ చెప్పాడు.  ఖవాజాకు మూడు నుంచి నాలుగు వారాల విశ్రాంతి అవసరమని, దాంతో ఖవాజా వరల్డ్‌కప్‌ నుంచి వైదొలగాల్సి వచ్చిందని చెప్పాడు. 

ఇంగ్లండ్‌తో కీలక సెమీ ఫైనల్‌కు ముందు ఇలా జరగడం బాధాకరమని, మా జట్టులో అతను ప్రధాన ఆటగాడు. యాషెస్‌ సిరీస్‌ నాటికి ఖవాజా అందుబాటులోకి వస్తాడు’ అని లాంగర్‌ తెలిపాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఖవాజా ఐదు బంతులు ఆడిన తర్వాత రిటైర్డ్‌ హర్ట్‌గా పెవిలియన్‌ చేరాడు. 

ఆసీస్‌ ఏడు వికెట్లు కోల్పోయిన తరుణంలో ఖవాజా తిరిగి బ్యాటింగ్‌కు వచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఖవాజా 14 బంతులు ఆడి 18 పరుగులు చేశాడు. గాయపడ్డ ఖవాజా స్థానంలో మాథ్యూ వేడ్‌కు అవకాశం కల్పించనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios