కాగజ్‌నగర్‌: తెలంగాణలోని కుమ్రం భీమ్ జిల్లా కాగజ్ నగర్ పరిధిలోని సార్సా ఘటన కొత్త మలుపు తీసుకుంది.కాగజ్‌నగర్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ (ఎఫ్ఆర్వో) అనిత, మరో 15 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేసినట్లు ఆసిఫాబాద్‌ డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు. ఆదివారంనాడు ఆయన ఆ విషయం చెప్పారు. 

వారం రోజుల క్రితం మండలంలోని సార్సాల గ్రామంలో మొక్కలు నాటేందుకు వచ్చిన ఎఫ్‌ఆర్వో అనిత, సిబ్బంది కులం పేరుతో దూషించి దాడి చేసినట్లు అదే గ్రామానికి చెందిన నాయిని సరోజ ఈసుగాం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని ఆయన చెప్పారు. దాంతో కేసు నమోదు చేసినట్టు ఆయన వివరించారు.

అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కృష్ణ.. అటవీశాఖ సిబ్బందిపై వారం రోజుల క్రితం దాడి చేసిన విషయం తెలిసిందే. సిర్సాలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రత్యామ్నాయ అటవీకరణ పనులను పర్యవేక్షించేందుకు అటవీ రేంజ్ ఆఫీసర్ అనిత, తన సిబ్బందితో కలిసి వెళ్లారు.

అయితే వీరిని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, జిల్లా పరిషత్ ఛైర్మన్ కోనేరు కృష్ణ వందలాది మంది సిబ్బందితో కలిసి అడ్డుకున్నారు. అనితతో పాటు సిబ్బందిపై కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు.

సంబంధిత వార్తలు

మహిళా ఫారెస్ట్ అధికారిని చితకబాదిన జడ్పీ వైఎస్ ఛైర్మన్ (వీడియో)

మాకు ఆయుధాలు ఇవ్వండి: కోనేరు కృష్ణ దాడిపై అనిత

అనితపై దాడి: కోనేరు కృష్ణ మరిన్ని అరాచకాలు, వీడియో లీక్

ఎమ్మెల్యే కోనప్పపై ఎఫ్ఆర్ఓ అనిత సంచలన వ్యాఖ్యలు

సార్సాలో ఉద్రిక్తత: అటవీశాఖాధికారులను అడ్డుకొనేందుకు గ్రామస్తుల యత్నం

బూటు కాలితో తన్నింది, అందుకే దాడి: అనితపై ఎమ్మెల్యే కోనప్ప

వైస్ చైర్మన్ దాడి: గుర్తు చేసుకుని ఏడ్చేసిన అనిత

నన్ను వాళ్లు ఏం చేస్తారోనని భయంగా ఉంది.. అనిత

ఎఫ్‌ఆర్‌వోపై దాడి: చట్టానికి ఎవరూ అతీతులు కాదన్న కేటీఆర్

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి ఎఫెక్ట్: కోనేరు కృష్ణ సహా మరో 16 మంది అరెస్ట్

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి ఎఫెక్ట్: కోనేరు కృష్ణ సహా మరో 16 మంది అరెస్ట్

ఎఫ్ఆర్ఓ అనితపై దాడిపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందన ఇదీ

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి: కోనేరు కృష్ణపై కేసు

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి ఎఫెక్ట్: జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ పదవికి కృష్ణ రాజీనామా

నేను దాడి చేయలేదు, వాళ్లే దాడి చేశారు: జిల్లా పరిషత్ వైస్ ఛైర్మెన్ కృష్ణ

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి: నిందితులపై చర్యలు తీసుకోవాలన్న హరీష్ (వీడియో)