మెగా పవర్ స్టార్ రాంచరణ్ అభిమానులకు గుడ్ న్యూస్. రాంచరణ్ సైలెంట్ గా ఎలాంటి హడావిడి లేకుండా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాని ఓపెన్ చేశాడు. ప్రస్తుతం సినీ సెలెబ్రెటీలు సామజిక మాధ్యమాలలో యాక్టివ్ గా ఉండడం కీలకంగా మారింది. చాలా మంది సినీ తారలు తమ అభిప్రాయాలని, విశేషాలని పంచుకునేందుకు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ని ఎంచుకుంటున్నారు. 

ఈ విషయంలో రాంచరణ్ కాస్త స్లోనే అని చెప్పొచ్చు. రాంచరణ్ ఇప్పటివరకు కేవలం ఫేస్ బుక్ లో మాత్రమే ఉన్నాడు. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లలో చరణ్ కు అకౌంట్ లేదు. ఎట్టకేలకు చరణ్ మరో ముందడుగు వేసి ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ ప్రారంభించాడు. 

కొద్దిసేపటి క్రితమే ఇన్స్టాగ్రామ్ ఖాతా ఓపెన్ చేసిన చరణ్ కు అప్పుడే 13 వేలమందికి పైగా ఫాలోవర్స్ వచ్చారు. రంగస్థలం చిత్రంలోని గడ్డం లుక్ తో చరణ్ తొలి పోస్ట్ పెట్టాడు. ఎలాంటి కామెంట్స్ చేయలేదు. దీనితో ఇన్స్టాగ్రామ్ లోకి అభిమానులు రాంచరణ్ కు గ్రాండ్ గా స్వాగతం పలుకుతున్నారు. 

ఇటీవలే ప్రభాస్ కూడా ఇంస్టాగ్రామ్ ఖాతా ఓపెన్ చేసి సాహో ప్రచార కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాంచరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నాడు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ram Charan (@alwaysramcharan) on Jul 8, 2019 at 12:24am PDT