తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి.

11:47 AM (IST) Jun 13
Interest Rates: రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు తగ్గించిన విషయం తెలిసిందే. కాని ఇంకా కొన్ని చిన్న ఫైనాన్స్ బ్యాంకులు 9.5% వరకు FD వడ్డీ ఇస్తున్నాయి. ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఏఏ బ్యాంకులు ఎంతెంత వడ్డీ ఇస్తున్నాయో చూద్దామా?
10:59 AM (IST) Jun 13
Star link: ఎలాన్ మస్క్ ఇండియా ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఒక నెల స్టార్‌లింక్ ఉచిత ట్రయల్ ఆఫర్ తీసుకొని నచ్చితేనే కనెక్షన్ తీసుకోమంటున్నారు. ఆ ఆఫర్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది? ఫీజ్ ఎంత? ఇలాంటి మరిన్ని వివరాలు తెలుసుకుందామా?
11:21 PM (IST) Jun 12
India develops sixth generation stealth fighter jets: భారత్ 6వ తరం స్టెల్త్ యుద్ధవిమానాల అభివృద్ధిలోకి అడుగుపెట్టింది. AMCA ప్రాజెక్టుతో ఏఈఎఫ్‌కు అత్యాధునిక శక్తిని అందించేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి.
09:16 PM (IST) Jun 12
Air India crash in Ahmedabad: అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో సీటు 11ఏలో ఉన్న ప్రయాణికుడు మిరాకిల్ గా ప్రాణాలతో బయటపడ్డాడు. మిగతావారందరూ ప్రాణాలు కోల్పోయారు.
08:53 PM (IST) Jun 12
Air India plane crash: అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదంలో 241 మంది మరణించారు. ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
08:13 PM (IST) Jun 12
air india plane crashes Ahmedabad: అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం ఇస్తామని టాటా గ్రూప్ ప్రకటించింది. గాయపడిన వారికి వైద్య సహాయం కల్పిస్తామన్నారు.
07:39 PM (IST) Jun 12
air india plane crashes Ahmedabad: అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీతో పాటు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.
07:27 PM (IST) Jun 12
Hydration: వేసవిలో నీళ్లు తాగడం చాలా అవసరం. కాని మామూలు నీళ్లు తాగే బదులు చిటికెడు ఉప్పు కలిపి తాగితే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా? ఈ రహస్యం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
07:27 PM (IST) Jun 12
దేశ చరిత్రలోనే అత్యంత ఘోర ప్రమాదం, ఏకంగా 200 మందికి పైగా మరణించిన ఆకాశమంతా విషాదం. అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం యావత్ దేశాన్ని ఉలిక్కపడేలా చేసింది. ఈ నేపథ్యంలో బోయింగ్ విమానాల భద్రత అంశంపై చర్చ మొదలైంది.
07:15 PM (IST) Jun 12
రోజుకి మూడు లీటర్ల నీరు తాగమని వైద్యులు చెబుతున్నారు. కానీ, అలా తాగడం వల్ల శరీరానికి మేలా,నష్టమా..?
06:56 PM (IST) Jun 12
ప్రస్తుతం చీరల మీదకి లాంగ్ నెక్లెస్ డిజైన్లు ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి.వీటికి తోడు డీప్ నెక్ బ్లౌజ్ లు వేసుకుంటే అవి ఇంకా అందంగా కనిపిసత్ాయి. బంగారం, వెండితో పాటు ముత్యాల లాంగ్ నెక్లెస్‌లతో కూడా మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.
06:36 PM (IST) Jun 12
ఏపీలో 10వ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో బాలికలు 80.10% ఉత్తీర్ణత సాధించారు. రీకౌంటింగ్‌కు జూన్ 13 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
06:28 PM (IST) Jun 12
కిచెన్ లో సింక్ మూసుకుపోతే..కేవలం ఈజీగా వాటర్ బాటిల్ తో దాన్ని శుభ్రం చేయోచ్చు.అంతేకాకుండా గుప్పెడు ఉప్పు,నిమ్మకాయ వంటి వాటితో కూడా ఈజీగా బ్లాక్ అయిన సింక్ ని తెరవొచ్చు.
06:22 PM (IST) Jun 12
Ahmedabad plane crash: అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. ఎయిర్ ఇండియా AI171 డ్రీమ్లైనర్ ప్రమాదానికి ముందు బోయింగ్ చేసిన 5 పెద్ద తప్పిదాలు ఇప్పుడు విమర్శలకు కేంద్రబిందువుగా మారాయి. ఆవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
05:41 PM (IST) Jun 12
Ahmedabad plane crash: అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియ విమానం రన్‌వే 23 నుంచి లండన్ గట్విక్ విమానాశ్రయానికి బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదానికి కారణమేంటి?
05:35 PM (IST) Jun 12
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మరణాల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమాదానికి ముందు జరిగిన కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
05:08 PM (IST) Jun 12
లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కూలిపోయింది. ఈ దుర్ఘటనలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా భారతదేశంలో ఇప్పటివరకు జరిగిన భయంకరమైన విమాన దుర్ఘటనల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
05:06 PM (IST) Jun 12
మీరు ఎప్పుడైనా ధనవంతులను గమనించి ఉంటే ఎక్కడా అనవసరంగా డబ్బును ఖర్చు చేయరు. అవసరమైతే మాత్రం ఎంతైనా ఆలోచించరు. ఎందుకంటే వారు కొన్ని ప్రత్యేకమైన రూల్స్ ఫాలో అవడం వల్లనే ధనవంతులయ్యారు. అవి పాటిస్తే ఎవరైనా డబ్బున్న వారు కావచ్చు. అవేంటో తెలుసుకుందామా?
04:55 PM (IST) Jun 12
ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ల నొప్పులు వస్తున్నాయి. కనీసం పాతికేళ్లు కూడా రాకుండానే కొంచెం దూరం కూడా నడవలేకపోతున్నారు. మోకాళ్లు,కీళ్ల నొప్పులతో బాధపడేవారు అధికంగా ఉంటున్నారు. అలాంటి వారి కోసం కొన్ని యోగాసనాలు.
04:45 PM (IST) Jun 12
అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటన దేశ వ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో ఇప్పటి వరకు విమాన ప్రమాదాల్లో మరణించిన ప్రముఖులు ఎవరు.? ఈ దుర్ఘటనలు ఎప్పుడు జరిగాయి.? తెలుసుకుందాం.
04:40 PM (IST) Jun 12
ahmedabad plane crash: అహ్మదాబాద్‌లో కూలిన ఎయిరిండియా విమానాన్ని కేప్టెన్ సుమీత్ సభర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుండర్ నడిపిస్తున్నారు. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ఉన్నారు.
04:26 PM (IST) Jun 12
అహ్మదాబాద్ నుండి లండన్ కు వెళుతున్న ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురయ్యింది. టేకాఫ్ అయిన వెంటనే విమనాశ్రయం సమీపంలో కుప్పకూలడంతో చాలామంది ప్రాణాలు కోల్పోయారు.
04:17 PM (IST) Jun 12
అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం (AI 171) గురువారం మధ్యాహ్నం బయలుదేరిన కొద్ది క్షణాలకే మేఘనీనగర్ ప్రాంతంలో కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదం యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది.
04:11 PM (IST) Jun 12
Vijay Rupani: అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమాన ప్రమాదంలో మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి చెందినట్టు వార్తలు వెలువడినప్పటికీ, అధికారికంగా ధృవీకరించలేదు.
03:50 PM (IST) Jun 12
Airplane crash in Ahmedabad: అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. విమానంలో మొత్తం 242 మంది ఉన్నారు. భారీ ప్రాణ నష్టం అంచనాల మద్య ఈ ఘటనపై ప్రధాని మోడీ అత్యవసరంగా సమీక్ష నిర్వహించారు.
03:49 PM (IST) Jun 12
అమరావతి నిర్మాణ పనుల్లో వేగాన్ని పెంచింది కూటమి ప్రభుత్వం. మూడేళ్లలో రాజధాని ఒక రూపు తీసుకురావాలన్న లక్ష్యంతో పని చేస్తోంది. ఇందులో భాగంగానే అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.
03:47 PM (IST) Jun 12
అహ్మదాబాద్ లో కుప్పకూలిన ఎయిరిండియా విమానం భారతీయులతో పాటు చాలామంది విదేశీయులు ఉన్నారు. ఏయే దేశాలకు చెందినవారు ఉన్నారో తెలుసా?
03:42 PM (IST) Jun 12
డెలివరీ అయిన తరువాత చాలా మంది తల్లులు తమ ఆరోగ్యం గురించి,శరీరం గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ అలా చేయడం వల్ల భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది.డెలివరీ తరువాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ చూద్దాం.
03:14 PM (IST) Jun 12
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి గురువారంతో ఏడాది ముగిసింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జనసేన పార్టీ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేసింది.
03:12 PM (IST) Jun 12
అహ్మదాబాద్ లో కుప్పకూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానితో పాటు మరికొందరు ప్రముఖులు ఉన్నట్లు సమాచారం.
02:29 PM (IST) Jun 12
పెళ్లైన 15 రోజుల్లోనే భర్తను గొడ్డలితో హత్య చేసిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. దంపతుల గొడవలే దీనికి కారణమని అనుమానం.
02:23 PM (IST) Jun 12
క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించే సమయంలో మనకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి... ఒకటి టోటల్ పేమెంట్స్, ఇంకోటి మినిమం పేమెంట్. ఇందులో ఏ పేమెంట్ ను ఎంచుకుంటే మంచిదో ఇక్కడ చూద్దాం.
02:22 PM (IST) Jun 12
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో గురువారం ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. అహ్మదాబాద్ నుండి లండన్‌కు వెళ్లే విమానం టేకాఫ్ సమయంలో సర్దార్ వల్లభభాయి పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
01:57 PM (IST) Jun 12
ఏపీ ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకం కింద 67 లక్షల తల్లుల ఖాతాల్లో రూ.13,000 చొప్పున నిధులు జమ చేస్తోంది.
01:22 PM (IST) Jun 12
అన్నం వండడానికి చాలా మంది ఇప్పటికీ పాత పద్దతులు వాడుతుంటారు. కొందరు మాత్రం ప్రెజర్ కుక్కర్ ని ఉపయోగిస్తుంటారు. వీటిలో ఏది సరైన పద్దతి అని తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు.
01:04 PM (IST) Jun 12
బంగారం ధర మళ్లీ చుక్కలు చూపిస్తుంది. గోల్డ్ ప్రైస్ గత కొన్ని రోజులుగా క్రమంగా తగ్గుతూ వచ్చింది. అయితే తాజాగా మరోసారి తులం బంగారం ధర లక్ష దాటేసింది. ఇంతకీ బంగారం ధర మళ్లీ పెరగడానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.
12:38 PM (IST) Jun 12
మస్క్ మామ మామూలోడు కాదు… ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది వినియోగదారులను కలిగిన వాట్సాప్ కే చెక్ పెట్టేందుకు సిద్దమయ్యారు. ఇందకోసం సరికొత్త యాప్ తో సోషల్ మీడియాను షేక్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇంతకూ ఆ యాప్ ఏంటి?
12:21 PM (IST) Jun 12
జ్యోతిష శాస్త్రం ప్రకారం, గ్రహాల గమన మార్పులు మన జీవితాలపై గణనీయ ప్రభావం చూపుతాయి. ఈ జూలైలో శని, కుజుడుల సంచార మార్పులు కొన్ని రాశుల వారిపై ప్రభావం చూపనుంది. ఇంతకీ ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
11:57 AM (IST) Jun 12
డబ్ల్యూతీసీ ఫైనల్‌లో రబాడా ఐదు వికెట్లతో చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్‌లో ఇద్దరు ఓపెనర్లు డకౌట్ కావడం తొలిసారి.
11:48 AM (IST) Jun 12
అక్రమ వలసదారులపై ఇమ్మిగ్రేషన్ అధికారుల దాడులతో మొదలైన నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆరో రోజు కూడా ఆందోళనలు తీవ్రతరమయ్యాయి.