- Home
- Technology
- Tech News
- XChat : మీ ఫోన్ లో ఈ ఒక్క యాప్ ఉంటేచాలు... ఫోన్ నెంబర్ లేకుండానే కాల్స్, చాటింగ్, పేమెంట్స్
XChat : మీ ఫోన్ లో ఈ ఒక్క యాప్ ఉంటేచాలు... ఫోన్ నెంబర్ లేకుండానే కాల్స్, చాటింగ్, పేమెంట్స్
మస్క్ మామ మామూలోడు కాదు… ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది వినియోగదారులను కలిగిన వాట్సాప్ కే చెక్ పెట్టేందుకు సిద్దమయ్యారు. ఇందకోసం సరికొత్త యాప్ తో షేక్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇంతకూ ఆ యాప్ ఏంటి?
- FB
- TW
- Linkdin
Follow Us

మస్క్ మామ మామూలోడు కాదు భయ్యో..! వాట్సాప్ తోనేే వార్
XChat : ఎలాన్ మస్క్ … ప్రపంచవ్యాప్తంగా గట్టిగా వినిపిస్తున్న పేరిది. ఆయన ఏం చేసినా సంచలనమే. టెస్లాను స్థాపించి బిజినెస్ లో... స్పేస్ ఎక్స్ తో అంతరిక్ష రంగంలో.. ట్విట్టర్ ను కొనుగోలుచేసి ఎక్స్ గా మార్చి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కు మద్దతిచ్చి, ఇటీవల అధ్యక్షుడితో విబేధించి వార్తల్లో నిలిచారు... ఇప్పుడు మరోసారి సరికొత్త టెక్నాలజీతో ముందుకువస్తూ యావత్ ప్రపంచాన్నే షేక్ చేసేందుకు సిద్దమయ్యారు ఎలాన్ మస్క్.
ఆన్లైన్ మేసేజింగ్ ఆండ్ కాలింగ్ యాప్ వాట్సాప్ కు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. భారతదేశంలో కూడా వాట్సాప్ తో పాటు టెలిగ్రామ్ వంటి యాప్స్ ను వినియోగిస్తున్నారు. అయితే కోట్లాదిమంది వినియోగదారులను కలిగిన వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్స్ కు గట్టిపోటీ ఇచ్చేందుకు ఎలాన్ మస్క్ సిద్దమయ్యారు. ఇందుకోసం XChat పేరుతో సరికొత్త ఆన్లైన్ మెసేజింగ్ ఆండ్ కాలింగ్ యాప్ తో వస్తున్నాడు.
ఇలా టెక్నాలజీ ప్రపంచంలో మరో విప్లవాత్మకమైన అడుగు వేస్తున్నారు ఎలాన్ మస్క్. అతడి XChat యాప్ అత్యున్నత గోప్యత, డేటా భద్రత, సులభమైన ఇంటర్‌ఫేస్‌తో చాటింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
XChat అంటే ఏమిటి?
XChat అనేది X ప్లాట్‌ఫారమ్ కోసం రూపొందించిన చాటింగ్ ఫీచర్. ప్రస్తుతం ఇది ఎంపిక చేసిన సబ్‌స్క్రైబర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇది చాటింగ్, వీడియో కాల్స్‌కు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను అందిస్తుంది. యూజర్లు కనిపించకుండా పోయే మెసేజ్‌లను పంపవచ్చు... అంటే కొంత సమయం తర్వాత ఆటోమేటిక్‌గా మేసేజ్ లు డిలీట్ అవుతాయి. ముఖ్యమైన విశేషం ఏమిటంటే ఫోన్ నంబర్ అవసరం లేకుండానే ఆడియో, వీడియో కాల్స్ చేయవచ్చు. ఒక్క X అకౌంట్‌తోనే అన్ని డివైజ్‌లలో చాటింగ్, కాల్స్‌ను సులభంగా నిర్వహించవచ్చు.
X Chat భద్రత, గోప్యత హామీ
ఎలాన్ మస్క్ ప్రకారం... XChat రస్ట్ ఆధారిత ఎన్‌క్రిప్షన్ ఆర్కిటెక్చర్‌పై నిర్మితమైంది. దీనిని ఆయన ‘బిట్‌కాయిన్ శైలి ఎన్‌క్రిప్షన్’ అని పిలుస్తున్నారు. ఇది యూజర్ల డేటాను పూర్తిగా సురక్షితంగా ఉంచుతుంది. అదనంగా యూజర్లు తమ చాట్‌లను రక్షించుకోవడానికి 4-అంకెల పిన్ కోడ్‌ను సెట్ చేసుకోవచ్చు, ఇది గోప్యతను మరింత పెంచుతుంది.
XChat ప్రత్యేకతలు
XChat ప్రస్తుతం బీటా వెర్షన్‌లో ఉంది, ఈ క్రింది ఫీచర్‌లను కలిగి ఉంది
గ్రూప్ చాట్: ఒకేసారి చాలా మందితో కనెక్ట్ అవ్వొచ్చు. ఇది అందరూ కలిసి చర్చించేందుకు, ఉద్యోగులు పనులను సమన్వయం చేసుకోడానికి ఉపయోగపడుతుంది.
సులభంగా ఫైల్ షేరింగ్: ఏ రకమైన ఫైల్‌లనైనా సులభంగా పంపవచ్చు, స్వీకరించవచ్చు.
క్రాస్-ప్లాట్‌ఫారమ్ సపోర్ట్: అన్ని డివైజ్‌లలో సజావుగా పనిచేస్తుంది.
Xchat ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
ప్రస్తుతం XChat కొంతమంది చెల్లింపు సబ్‌స్క్రైబర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. కానీ కంపెనీ త్వరలోనే దీన్ని అందరు X యూజర్‌లకు అందించాలని యోచిస్తోంది. మరో వారంలో అందుబాటులోకి తెచ్చే అవకాశాలున్నాయి.
ఎలాన్ మస్క్ ‘ఎవ్రీథింగ్ యాప్’ కల
ఎలాన్ మస్క్ XChatని కేవలం చాటింగ్ యాప్‌గా కాకుండా ‘ఎవ్రీథింగ్ యాప్’ దృక్పథంతో ప్రారంభించారు. ఈ యాప్ చాటింగ్, కాల్స్ నుండి భవిష్యత్తులో చెల్లింపులు, సోషల్ మీడియా, ఇతర సేవలను కలిగి ఉన్న మల్టీ-టాస్కింగ్ ప్లాట్‌ఫారమ్‌గా మారుతుంది. X ద్వారా మస్క్ ఒకే యాప్‌లో అన్నీ సాధించాలనే లక్ష్యంతో ఉన్నారు.
మొత్తం మీద ఎలాన్ మస్క్ XChat టెక్నాలజీ, గోప్యతపై దృష్టి సారించి చాటింగ్‌కు కొత్త అర్థాన్నిస్తోంది. WhatsApp వంటి ప్లాట్‌ఫారమ్‌లకు ఇది గట్టి పోటీనిస్తుంది, యూజర్‌లకు భద్రత, సరళత, ఆధునికతను అందిస్తుంది. టెక్నాలజీ యొక్క ఈ కొత్త ట్రెండ్‌లో భాగం కావడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?