MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Credit Card బిల్లు మొత్తం కట్టడం మంచిదా? మినిమం డ్యూ కట్టడం మంచిదా?

Credit Card బిల్లు మొత్తం కట్టడం మంచిదా? మినిమం డ్యూ కట్టడం మంచిదా?

క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించే సమయంలో మనకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి... ఒకటి టోటల్ పేమెంట్స్, ఇంకోటి మినిమం పేమెంట్. ఇందులో ఏ పేమెంట్ ను ఎంచుకుంటే మంచిదో ఇక్కడ చూద్దాం. 

2 Min read
Author : Arun Kumar P
| Updated : Jun 12 2025, 02:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
 క్రెడిట్ కార్డు  వల్ల లాభమా? నష్టమా?
Image Credit : freepik

క్రెడిట్ కార్డు వల్ల లాభమా? నష్టమా?

బ్యాంక్ అకౌంట్ తెరిచిన వెంటనే మనం కోరుకున్నా, కోరకపోయినా మన పర్సులో ఏదో ఒక క్రెడిట్ కార్డ్ చేరుతుంది. ప్రస్తుతం ప్రతిఒక్కరికి ఒక సెల్ ఫోన్ ఉన్నట్లే ఒక్కొక్కరికి ఒక క్రెడిట్ కార్డ్ ఉండే పరిస్థితి ఇప్పుడు ఉంది. అయితే క్రెడిట్ కార్డ్ లిమిట్ ఉందికదా అని చాలామంది  చూసిచూడకుండా ఖర్చు చేస్తుంటారు… దీనివల్ల కొందరు లాభపడినా చాలామంది ఇబ్బందులు పడుతుంటారు.  

క్రెడిట్ కార్డ్ వల్ల ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. బిల్లు చెల్లించడంలో చిన్న తప్పులు చేసినా, అది పెద్ద భారాన్ని మోపుతుంది. క్రెడిట్ కార్డుల ద్వారా చేసే ఖర్చులకు 45 రోజుల వరకే వడ్డీ లేకుండా చెల్లించే అవకాశం ఉంటుంది… ఆలోపు  చెల్లింపు చేస్తే సమస్య లేదు. గడువు దాటితే మాత్రం చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి  వస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
మినిమం పేమెంట్ ను ఎలా నిర్ణయిస్తారు?
Image Credit : Gemini

మినిమం పేమెంట్ ను ఎలా నిర్ణయిస్తారు?

చాలామంది క్రెడిట్ కార్డును విరివిగా వాడతారు… తీరా బిల్లు చెల్లించే సమయానికి డబ్బులు లేక మొత్తం చెల్లించకుండా మినిమం డ్యూ పే చేస్తారు. ఇది మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం. 

మినిమం డ్యూ అంటే మీరు ప్రస్తుతం చెల్లించాల్సిన మొత్తాన్ని తర్వాతి గడువులో చెల్లిస్తానంటూ పొడిగించడం అన్నమాట. క్రెడిట్ కార్డ్ కంపెనీ సాధారణంగా మీ బ్యాలెన్స్‌లో 5% నుండి 10% వరకు కనీస చెల్లింపుగా నిర్ణయిస్తుంది. ఉదాహరణకు మీకు రూ.10,000 బ్యాలెన్స్ ఉంటే, మీరు రూ.500 నుండి రూ.1000 వరకు మీనిమం పేమెంట్ గా చెల్లించాల్సి ఉంటుంది.

37
క్రెడిట్ కార్డ్ మినిమం పేపెంట్స్ వల్ల నష్టాలు
Image Credit : Getty

క్రెడిట్ కార్డ్ మినిమం పేపెంట్స్ వల్ల నష్టాలు

క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించే సమయంలో మొత్తం చెల్లింపు (టోటల్ అమౌంట్) కంటే దాని పక్కన ఉండే మినిమమ్ చెల్లింపు (మినిమమ్ అమౌంట్ డ్యూ) చాలామందిని ఆకర్షిస్తుంది. ఎందుకంటే అది చాలా తక్కువ అమౌంట్ కాబట్టి. అయితే మొత్తం చెల్లించడానికి డబ్బులు లేనప్పుడు  మినిమమ్ చెల్లింపు చేయవచ్చు. మొత్తం చెల్లింపులో 5 శాతం మినిమమ్ డ్యూగా చెల్లించాల్సి ఉంటుంది.

 కొందరు ఎప్పుడూ మినిమమ్ చెల్లింపును మాత్రమే చెల్లిస్తుంటారు. కానీ ఈ మినిమమ్ చెల్లింపులు పెద్ద భారాన్ని మోపుతాయని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. మినిమమ్ పేమెంట్ ద్వారా ఆలస్య రుసుము (లేట్ ఫీజు) వసూలు చేయరు కానీ మిగిలిన మొత్తానికి వడ్డీ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

47
చేజేతులా CIBIL Score దెబ్బతీసుకున్నట్లే...
Image Credit : our own

చేజేతులా CIBIL Score దెబ్బతీసుకున్నట్లే...

క్రెడిట్ కార్డ్ బిల్లు మినిమం చెల్లింపుల ద్వారా సిబిల్ స్కోర్ కూడా ప్రభావితమవుతుందట. కాబట్టి సిబిల్ స్కోర్‌ను పెంచుకోవాలనుకునేవారు ఖచ్చితంగా ఈ మినిమం చెల్లింపులకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. వీలైనంత వరకు, ప్రతి నెలా మొత్తం బిల్లు చెల్లింపు చేయడమే ఉత్తమమని అంటున్నారు ఒకవేళ చాలా పెద్ద మొత్తం చెల్లించాల్సి ఉంటే క్రెడిట్ కార్డ్ కంపెనీతో మాట్లాడి ఈఎంఐగా మార్చుకోవచ్చని సలహా ఇస్తున్నారు. 

57
క్రెడిట్ కార్డ్ మొత్తం బిల్లు కట్టడంవల్ల లాభాలు..
Image Credit : our own

క్రెడిట్ కార్డ్ మొత్తం బిల్లు కట్టడంవల్ల లాభాలు..

క్రెడిట్ కార్డ్ ఖాతాను మంచి స్థితిలో ఉంచుకోవడానికి సహాయపడుతుంది.

చెల్లింపులో తప్పులు లేకుండా ఉండటానికి సహాయపడుతుంది.

క్రెడిట్ స్కోర్ పాడవకుండా ఉండటానికి సహాయపడుతుంది.

67
క్రెడిట్ కార్డు బిల్లు మినిమం పేమెంట్ వల్ల నష్టాలు
Image Credit : our own

క్రెడిట్ కార్డు బిల్లు మినిమం పేమెంట్ వల్ల నష్టాలు

క్రెడిట్ కార్డ్ బిల్లులో మినిమం పేమెంట్స్ మాత్రమే చేయడం వల్ల మిగిలిన మొత్తంపై వడ్డీ జోడించబడుతుంది, దీని వల్ల మీ అప్పు మరింత పెరుగుతుంది. ఈ మినిమం పేమెంట్ అప్పటికప్పుడు ఉపశమనం కలిగించవచ్చు కానీ దీర్ఘకాలంలో ఆర్థిక సమస్యలను సృష్టిస్తుంది.

77
క్రెడిట్ కార్డు వాడేవారికి జాగ్రత్తలు
Image Credit : our own

క్రెడిట్ కార్డు వాడేవారికి జాగ్రత్తలు

వీలైనంత వరకు మినిమం పేమేంట్స్ కంటే మొత్తం బిల్లును కట్టడానికి ప్రాధాన్యత ఇవ్వండి. 

మీ క్రెడిట్ పరిమితిని పెంచుకోవడాన్ని నివారించండి.

క్రెడిట్ కార్డ్ వాడకాన్ని నియంత్రించండి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏమేం చెక్ చేయాలి?
Recommended image2
Gold Price Fall: ఊగిసలాడుతున్న పసిడి.. మళ్లీ భారీ పతనం..అయోమయంలో కొనుగోలుదారులు
Recommended image3
మీ ద‌గ్గ‌ర పైస‌లు ఉన్నాయా.? ఇలా చేస్తే.. మీ డ‌బ్బులు గుడ్లు పెట్ట‌డం ఖాయం
Related Stories
Recommended image1
Credit Card: ఒక‌టి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటే.. లాభ‌మా? న‌ష్ట‌మా.?
Recommended image2
Credit cards: ఈ క్రెడిట్ కార్డ్స్ తో ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు.. ఎలాగంటే..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved