- Home
- National
- Ahmedabad Plane Crash: విమాన ప్రమాదానికి ముందు పైలట్ మేడే కాల్.. దీని అర్థం ఏంటో తెలుసా.?
Ahmedabad Plane Crash: విమాన ప్రమాదానికి ముందు పైలట్ మేడే కాల్.. దీని అర్థం ఏంటో తెలుసా.?
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మరణాల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమాదానికి ముందు జరిగిన కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

విమాన ప్రమాదాల్లో వినిపించే పదాలు
విమాన ప్రమాదం జరిగిన ప్రతీసారీ వార్తల్లో కొన్ని పదాలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఏటీసీ, బ్లాక్ బాక్స్, మేడే కాల్ అనే పదాలు వాటిలో ముఖ్యమైనవి. ఇవి ఒక్కో దానికి సంబంధించి విమాన ప్రయాణ భద్రతలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ పదాల అర్థం ఏమిటి? అవి ఎలా పనిచేస్తాయి అన్నదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మేడే కాల్ అంటే ఏంటి?
మేడే కాల్ అనేది అత్యవసర పరిస్థితిలో పైలట్ చేసే సిగ్నల్. ఇది విమానానికి ప్రమాదం ఎదురైందని, వెంటనే సహాయం అవసరమన్న అర్థంలో వస్తుంది. పైలట్లు మూడు సార్లు వరుసగా "Mayday, Mayday, Mayday" అని చెబుతారు.
ఇది వాస్తవానికి ఫ్రెంచ్ పదం "M’aider" నుంచి వచ్చింది. దీని అర్థం "నాకు సహాయం చేయండి". ఈ సంకేతాన్ని విన్న వెంటనే ATC, అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ విభాగాలు అప్రమత్తం అవుతాయి.
ఎప్పుడు మేడే కాల్ చేస్తారు?
ప్రమాదం పొంచి ఉన్న సమయంలో, ఉదాహరణకు: ఇంధనం తక్కువగా ఉన్నప్పుడు, ఇంజిన్ ఫెయిల్యూర్, గాలిలో తుపానుల వల్ల నియంత్రణ కోల్పోయినప్పుడు, టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో సమస్యలు ఎదురైతే ఈ తరహా అత్యవసర పరిస్థితుల్లో మేడే కాల్ ఉపయోగిస్తారు.
మేడే కాల్ చరిత్ర – ఎప్పుడు మొదలైంది?
1921లో లండన్‌కు చెందిన రేడియో అధికారిగా పనిచేసిన ఫ్రెడరిక్ స్టాన్లీ మాక్‌ఫోర్డ్ అనే వ్యక్తి ఈ మేడే కాల్‌ను ప్రతిపాదించాడు. అంతకుముందు షిప్పింగ్ రంగంలో SOS కాల్ వాడితే, విమాన రంగానికి స్పష్టమైన అత్యవసర సంకేతంగా మేడే కాల్‌ను రూపొందించారు.
ఏటీసీ అంటే ఏంటి?
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) అనేది విమానాల గగనంలో ప్రయాణాన్ని పర్యవేక్షించే వ్యవస్థ. విమానం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తోంది, ఎంత ఎత్తులో ఉంది, ఇతర విమానాల మార్గాలను దాటి పోకుండా చూసే బాధ్యత ATCదే. పైలట్ టేకాఫ్, ల్యాండింగ్, మార్గ మార్పులు మొదలైన ప్రతిదానికీ ATC అనుమతిని తీసుకుంటాడు.
బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి?
బ్లాక్ బాక్స్ అనేది నిజానికి ఆరెంజ్ రంగులో ఉండే పరికరం. ఇది విమానంలో ఉన్న అన్ని ముఖ్య సమాచారం (పెర్లమినెంట్ డేటా)ను రికార్డ్ చేస్తుంది. ఇది రెండు భాగాలుగా ఉంటుంది: ఫ్లైట్ డేటా రికార్డర్ (FDR): విమాన వేగం, ఎత్తు, ఇంధనం, ఎంజిన్ పనితీరు, ల్యాండింగ్ గేర్ వాడకం వంటి డేటాను నమోదు చేస్తుంది.
కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (CVR): పైలట్, కోపైలట్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల మధ్య సంభాషణలు, కాక్‌పిట్‌లో జరిగిన శబ్దాలను రికార్డ్ చేస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే బ్లాక్ బాక్స్‌ను వెలికితీయడం ద్వారా దర్యాప్తు ప్రారంభించడంలో సహాయపడుతుంది.