మీకు ఫైనాన్సియల్ ఫ్రీడమ్ కావాలా? ఈ టెక్నిక్స్ ఫాలో అయితే ఎవరైనా ధనవంతులు కావచ్చు
మీరు ఎప్పుడైనా ధనవంతులను గమనించి ఉంటే ఎక్కడా అనవసరంగా డబ్బును ఖర్చు చేయరు. అవసరమైతే మాత్రం ఎంతైనా ఆలోచించరు. ఎందుకంటే వారు కొన్ని ప్రత్యేకమైన రూల్స్ ఫాలో అవడం వల్లనే ధనవంతులయ్యారు. అవి పాటిస్తే ఎవరైనా డబ్బున్న వారు కావచ్చు. అవేంటో తెలుసుకుందామా?

ధనవంతులు కావాలంటే..
ధనవంతులు కావాలని ఎవరు అనుకోరు. కాని అసలు ధనవంతులు అంటే ఏమిటో తెలుసుకొంటే ఎవరైనా ఈజీగా అవ్వొచ్చు. పెద్ద భవనాలు, పొలాలు, ఫ్యాక్టరీలు, కార్లు, ఉన్న వాళ్లు మాత్రమే ధనవంతులు కారు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉన్న వాళ్లు ఎవరైనా ధనవంతులే. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏమిటి? ఆ స్థితికి చేరుకోవాలంటే ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏమిటి?
చిన్న చిన్న అవసరాలకు, అప్పుడప్పుడు సరదాలకు, ఆసుపత్రి అవసరాలకు అప్పు చేయాల్సిన అవసరం లేకుండా ఉండటమే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఆర్థిక స్వాతంత్య్రం ఉన్న ఏ కుటుంబమైనా ఆనందంగా జీవితాన్ని గడుపుతుంది. దీనికోసం ఈ టెక్నిక్స్ ఫాలో అవ్వండి.
జీతంపై కంట్రోల్
మీ జీతం ఎంతైనా సరే కనీసం రెండు నెలల జీతం వరకు మీ దగ్గర నిల్వగా ఉంచుకోవాలి. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బంది వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవచ్చు. ఇదే నిజమైన ఆర్థిక స్వేచ్ఛకు మొదటి అడుగు.
నెలనెలా సేవింగ్స్
ప్రతి నెలా రూ.5,000 నుండి రూ.10,000 వరకు పొదుపు చేయడాన్ని అలవాటుగా మార్చుకోండి. ఇది భవిష్యత్తు అవసరాలకు, అత్యవసర ఖర్చులకు ఉపయోగపడుతుంది. మీ సంపాదనకు ఎంత ఉంటే అందులో కనీసం 20 శాతం సేవింగ్స్ చేయడం మంచిది.
అత్యవసర నిధి ఏర్పాటు
అనుకోని పరిస్థితులు ఎప్పుడైనా ఎదురుకావచ్చు. అంటే ఉద్యోగం పోవడం, వ్యాపారంలో నష్టాలు రావడం ఇలాంటప్పుడు ప్రమాద తీవ్రతను తక్కువ చేసేందుకు మీరు కనీసం మూడు నుంచి ఆరు నెలల ఖర్చులకు సరిపడా డబ్బును అత్యవసరంగా నిల్వగా మీ దగ్గర ఉంచుకోవాలి.
ఖర్చులపై నియంత్రణ
మీ మొత్తం ఆదాయంలో 5% నుండి 7% వరకు ఖర్చులకు కేటాయించండి. ఇది అనవసర ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుంది.
రిటైర్మెంట్ కోసం ప్రణాళిక
వృద్ధాప్యంలోనూ ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలంటే ఇప్పటి నుంచే రూ.1 కోటికి పైగా నిధిని రిటైర్మెంట్ కోసం పెట్టుబడి పెట్టాలి. ఇందుకు NPS, EPF లేదా SIP వంటి వాటిని ఉపయోగించుకోండి.
రెండో ఆదాయం అవసరం
కేవలం జీతంపై ఆధారపడకుండా రియల్ ఎస్టేట్, వాహనాల అద్దె, కెమెరాల అద్దె వంటి ఇతర ఆదాయ మార్గాల ద్వారా రెండో ఆదాయాన్ని సృష్టించండి. అదనంగా డివిడెండ్ షేర్లు, REITలు, బాండ్లు వంటి సాధనాల్లో పెట్టుబడి పెట్టండి.
బంగారంపై పెట్టుబడి
ప్రతి నెలా డిజిటల్ గోల్డ్ లేదా సావరిన్ గోల్డ్ బాండ్ల ద్వారా బంగారం కొనుగోలు చేయండి. ఇది భవిష్యత్ ఆర్థిక భద్రతకు తోడ్పడుతుంది.
ఈ టెక్నిక్స్ అన్నీ మీకు తెలియకుండానే మిమ్మల్ని ధనవంతులను చేస్తాయి. మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తాయి.