అహ్మదాబాద్ నుండి లండన్ కు వెళుతున్న ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురయ్యింది. టేకాఫ్ అయిన వెంటనే విమనాశ్రయం సమీపంలో కుప్పకూలడంతో చాలామంది ప్రాణాలు కోల్పోయారు.  

Air India : ఎయిరిండియా విమానం కుప్పకూలింది ఓ మెడికల్ కాలేజీ హాస్టల్ పై అని తెలుస్తోంది. దీంతో విమానంలోని ప్రయాణికులతో పాటు మెడికోలు ప్రమాదానికి గురయినట్లు పోలీసులు చెబుతున్నారు. బిజె మెడికల్ కాలేజ్ విద్యార్థులకు చెందిన హాస్టల్ భవనంపై విమానం కుప్పకూలడంతో మెడికోలు మరణించినట్లు తెలుస్తోంది. కానీ ఈ ఘటనకు చెందిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Scroll to load tweet…

ఇదిలావుంటే కూలిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానంలో భారత్ కు చెందినవారే కాదు విదేశీయులు కూడా ఉన్నారు. ఏ దేశానికి చెందినవారు ఎంతమంది ఉన్నారో ఎయిరిండియా ప్రకటించింది. మొత్తం 242 మందిలో 169 మంది భారతీయులు, 53 బ్రిటన్ కు చెందినవారు, 7 పోర్చుగల్, 1 కెనడినయన్ ఉన్నారు. ప్రయాణికుల్లో ఇద్దరు శిశువులు, 10 మందివరకు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. విమానంలో ఇద్దరు పైలట్లు, 10 ఇతర సిబ్బంది ఉన్నారు.

ప్రమాదంపై సమాచారం అందుకున్నవెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. అలాగే స్థానిక పోలీసులు, ఆర్మీ, ఇతర విపత్తు నిర్వహణ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విమాన ప్రమాదానికి సంబంధించి సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కొడుతకున్నారు. ఈ వీడియోలు, ఘటనా స్థలిలో పరిస్థితిని పరిశీలిస్తే ప్రమాద తీవ్రత ఎక్కువగానే ఉందని స్పష్టంగా అర్థమవుతోంది.

విమానం కుప్పకూలిన తర్వాత భారీ పేలుడు సంభవించింది. దీంతో ఆ ప్రాంతంలోని చాలా భవనాలు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని... ప్రమాదానికి సంబంధించిన వివరాలను తర్వాత వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ విమానంలో లండన్ కు బయలుదేరినవారి కుటుంబసభ్యులు ఘటనాస్థలానికి చేరుకుంటున్నారు. తమవారి ఆఛూకీ కోసం అధికారులను ఆరా తీస్తున్నారు.