MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • National
  • air india plane crash: ఎయిర్ ఇండియా ప్రమాద బాధిత కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం.. టాటా గ్రూప్ కీలక ప్రకటన

air india plane crash: ఎయిర్ ఇండియా ప్రమాద బాధిత కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం.. టాటా గ్రూప్ కీలక ప్రకటన

air india plane crashes Ahmedabad: అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం ఇస్తామని టాటా గ్రూప్ ప్రకటించింది. గాయపడిన వారికి వైద్య సహాయం కల్పిస్తామన్నారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 12 2025, 08:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై టాటా గ్రూప్ స్పందన
Image Credit : ANI

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై టాటా గ్రూప్ స్పందన

గురువారం అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదం దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం అందిస్తామని టాటా గ్రూప్ ప్రకటించింది. ప్రమాదంలో గాయపడినవారికి అవసరమైన వైద్య సహాయాన్ని పూర్తిగా అందజేస్తామనీ, బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్‌ను పునర్నిర్మించేందుకు సాయం చేస్తామని టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ప్రకటనలో ఏముంది?
Image Credit : X-twitter

టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ప్రకటనలో ఏముంది?

“ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 ఈ రోజు విమాన ప్రమాదానికి గురైంది. ఇది ఎంతో బాధను కలిగించింది. మృతుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం అందిస్తాము. గాయపడిన వారికి అవసరమైన చికిత్స అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. బీజే మెడికల్ హాస్టల్ పునర్నిర్మాణానికి మద్దతు ఇస్తాం. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాల తోడుగా నిలుస్తాం” అని చంద్రశేఖరన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

35
విమానంలోని ఒక్కరు మినహా అందరూ ప్రాణాలు కోల్పోయారు
Image Credit : X-twitter

విమానంలోని ఒక్కరు మినహా అందరూ ప్రాణాలు కోల్పోయారు

AI-171 విమానం మధ్యాహ్నం 1:48కి అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ గాట్విక్‌కు బయలుదేరింది. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే, కేవలం 625 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు అది కుప్పకూలింది. ఈ విమానంలో 242 మంది ఉండగా, అందులో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. ప్రమాద సమయంలో విమానం బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద పడి పేలినట్టు సమాచారం. ఇది అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి సమీపంలో ఉన్న హార్స్ క్యాంప్ ప్రాంతంలో చోటు చేసుకుంది.

45
మరణాలు మరింత పెరిగే అవకాశముంది
Image Credit : X-twitter

మరణాలు మరింత పెరిగే అవకాశముంది

అధికారిక సమాచారం ప్రకారం, ప్రమాదంలో 204 మంది మరణించినట్లు తొలుత పోలీసులు తెలిపారు. విమానంలోని అందరూ ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. కేవలం ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. కాలేజీలో కూడా పలువురు ప్రాణాలు కోల్పోయారు. మరణాలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ప్రస్తుతం 45 మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి బాగానే ఉందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది.

55
సాయం కోసం హెల్ప్ లైన్ నెంబర్లు
Image Credit : X-twitter

సాయం కోసం హెల్ప్ లైన్ నెంబర్లు

• పౌర విమానయాన మంత్రిత్వ శాఖ: 011-24610843, 9650391859

• ఎయిర్ ఇండియా హాట్‌లైన్: 1800 5691 444

• అహ్మదాబాద్ నగర పోలీస్: 07925620359

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
ప్రయాణం
సాంకేతిక వార్తలు చిట్కాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India Bullet Train: రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్ట్.. 350 కిమీ స్పీడ్‌తో భారత్ సొంత బుల్లెట్ ట్రైన్ చూశారా?
Recommended image2
US India Trade: అమెరికా-ఇండియా ట్రేడ్ పెరిగితే భారతీయులకు ఏం ప్రయోజనం?
Recommended image3
LPG Subsidy: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్ !
Related Stories
Recommended image1
Vijay Rupani: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి
Recommended image2
Ahmedabad plane crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. బోయింగ్ డ్రీమ్లైనర్ 5 సాంకేతిక తప్పిదాలే కారణమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved