- Home
- National
- Airplane crash in Ahmedabad: వైఎస్సార్ నుంచి సౌందర్య వరకు.. విమాన ప్రమాదాల్లో మరణించిన ప్రముఖులు
Airplane crash in Ahmedabad: వైఎస్సార్ నుంచి సౌందర్య వరకు.. విమాన ప్రమాదాల్లో మరణించిన ప్రముఖులు
అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటన దేశ వ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో ఇప్పటి వరకు విమాన ప్రమాదాల్లో మరణించిన ప్రముఖులు ఎవరు.? ఈ దుర్ఘటనలు ఎప్పుడు జరిగాయి.? తెలుసుకుందాం.
16

Image Credit : meta ai and instagram
రాజకీయ, సినీ ప్రముఖులు
విమాన ప్రమాదంలో మరణించిన వారిలో రాజకీయ నాయకులు మొదలు, సినిమా రంగానికి చెందిన ప్రముఖులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు దేశంలో చోటు చేసుకున్నాయి.
26
Image Credit : meta ai and instagram
వై.ఎస్. రాజశేఖర రెడ్డి
దివంగంత నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైెెె ఎస్ రాజశేఖర రెడ్డి 2009లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. నల్లమల్ల అడవిలో బెల్ 430 హెలికాప్టర్ కూలడంతో మరణించారు.
36
Image Credit : meta ai and instagram
ఇందర్ ఠాకూర్
1985లో ఎయిర్ ఇండియా కనిష్క-182 విమాన ప్రమాదంలో నటుడు ఇందర్ ఠాకూర్ మరణించారు.
46
Image Credit : meta ai and instagram
తరుణి సచ్దేవ్
నటి తరుణి సచ్దేవ్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ సమయంలో ఆమె వయసు కేవలం 14 ఏళ్లు మాత్రమే.
56
Image Credit : meta ai and instagram
సౌందర్య
దేశ వ్యాప్తంగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న నటి సౌందర్య సైతం హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. 2004లో కరీంనగర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి బెంగళూరు నుంచి బయలుదేరిన సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.
66
Image Credit : Getty
సంజయ్ గాంధీ
ఇందిరాగాంధీ తనయకుడు సంజయ్ గాంధీ కూడా విమాన ప్రమాదంలో మరణించారు. 980లో సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించారు.
Latest Videos