కిచెన్‌ లో సింక్‌ మూసుకుపోతే..కేవలం ఈజీగా వాటర్‌ బాటిల్‌ తో దాన్ని శుభ్రం చేయోచ్చు.అంతేకాకుండా గుప్పెడు ఉప్పు,నిమ్మకాయ వంటి వాటితో కూడా ఈజీగా బ్లాక్‌ అయిన సింక్‌ ని తెరవొచ్చు.

వంటగదిలో గిన్నెలు కడిగిన తరువాత అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే..సింక్‌ ని శుభ్రపరచడం. పాత్రలలో ఉన్న చెత్త అంతా సింక్‌ గొట్టంలో పేరుకుపోయి చాలా ఇబ్బంది పెడుతుంది. దాన్ని శుభ్రం చేయడానికి రకరకాల పద్దతులు ఉపయోగిస్తుంటాం. కానీ వాటి అన్నింటికి చెక్ పెట్టి కేవలం ఒక ఖాళీ బాటిల్‌ తో సులభంగా సింక్‌ ని శుభ్రం చేయోచ్చు.

గిన్నెలు కడిగే సమయంలో మిగిలిపోయిన మెతుకులు, కూరలు,కూరగాయల వేస్ట్‌ ఇవన్నీ కూడా సింక్‌ లో అడ్డుపడుతుంటాయి. దీంతో నీరు బ్లాక్‌ అయిపోతుంటుంది. ఆ సమయంలో దాన్ని శుభ్రం చేయాలంటే చాలా కష్టమైన పని.కానీ ఇక నుంచి మాత్రం ఆ పని పెద్ద కష్టం కాదు. ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం.ఒక ఖాళీ వాటర్‌ బాటిల్‌ తీసుకుని దాని మూత తీసేసి బాటిల్‌ మూతిని సింక్‌ బ్లాకేజ్‌ పై ఉంచి ఒక్కసారి గట్టిగా నొక్కండి.

దీంతో వాటర్ బాటిల్‌ లోని గాలి దాన్ని గట్టిగా కిందకి తోస్తుంది. దాంతో చెత్త అంతా ఒక్కసారిగా కిందకి కదలి సింక్‌లోని నీరు పారుతుంది.అదేవిధంగా, వంటగదిలోని సింక్ లోపల పైపు మూసుకుపోతే, నీరు వెళ్ళే రంధ్రంలో ఒక గుప్పెడు ఉప్పు వేయండి. ఒక నిమ్మకాయను సగానికి కోసి దాని నుండి రసాన్ని పిండండి. తరువాత, పాత వార్తాపత్రికను చుట్టి సింక్ రంధ్రం మూసి వేయండి. అరగంట తర్వాత మీరు దానిని బయటకు తీస్తే, పైపులోని అన్ని కీటకాలు, పురుగులు బయటకు వస్తాయి. వాటిని బయటకు తీసివేస్తే నీరు సులభంగా వెళ్తుంది. నీటిని బాగా మరిగించి సింక్‌లో పోయాలి. ఇలా చేయడం వల్ల సింక్‌లోకి నీరు వెళ్ళే పైపులోని అడ్డంకి తొలగిపోతుంది.

వారానికి రెండుసార్లు సబ్బుతో సింక్‌ను బాగా కడగాలి. నిమ్మ తొక్కను సింక్‌లో వేస్తే మంచి వాసన వస్తుంది.