గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో గురువారం ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. అహ్మదాబాద్ నుండి లండన్‌కు వెళ్లే విమానం టేకాఫ్ సమయంలో సర్దార్ వల్లభభాయి పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

విమానం టేకాఫ్ అవుతున్న సమయంలోనే విమానం కూలిన‌ట్లు తెలుస్తోంది. జ‌నావ‌సాల ప్రాంతంలో విమానం కుప్ప‌కూలిన‌ట్లు స‌మాచారం. ప్రమాదం జరిగిన వెంటనే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లు వెంటనే స్పందించాయి.

అహ్మదాబాద్ అగ్నిమాపక, అత్యవసర సేవల విభాగం నుంచి ఐదుకు పైగా ఫైరింజన్లను ఘటన స్థలానికి చేరుకున్నాయి.

"వివిధ ప్రాంతాల నుండి ఫైర్ టెండర్ల బృందాలు చేరుకున్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం," అని అగ్నిమాపక శాఖ సీనియర్ అధికారి వెల్లడించారు.

 

Scroll to load tweet…

 

ఈ ప్ర‌మాదంలో ఇప్పటి వరకు ఎటువంటి గాయాలు లేదా ప్రాణహానిపై సమాచారం లేదు. విమానానికి కలిగిన నష్టం, ప్రమాదానికి కారణాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. విమానాశ్రయ అధికారులు అంతర్గత విచారణ ప్రారంభించారు. సాంకేతిక బృందం విమానాన్ని పరిశీలిస్తోంది.

ఇదిలా ఉంటే ఈ విమానంలో మొత్తం 133 మంది ప్రయాణికులు ఉన్నట్టు అధికారిక సమాచారం. వారంతా సురక్షితంగా ఉన్నారని సమాచారం. ఏ ఒక్కరికి గాయాలేమీ జ‌ర‌గ‌లేద‌ని తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలను ఎయిర్ ఇండియా, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విడుదల చేయనుంది.