Star link: ఎలాన్ మస్క్ ఇండియా ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఒక నెల స్టార్‌లింక్ ఉచిత ట్రయల్ ఆఫర్ తీసుకొని నచ్చితేనే కనెక్షన్ తీసుకోమంటున్నారు. ఆ ఆఫర్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది? ఫీజ్ ఎంత? ఇలాంటి మరిన్ని వివరాలు తెలుసుకుందామా?

వాటర్ దొరికినంత ఈజీగా ఇంటర్నెట్ దొరికే రోజులు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే అందరి చేతుల్లో సెల్ ఫోన్, దానికి ఇంటర్నెట్ కనెక్షన్ కచ్చితంగా ఉంటున్నాయి. అయితే మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కనీసం సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా అందవు. ఇక ఇంటర్నెట్ సేవల సంగతి చెప్పనే అవసరం లేదు. అందుకే ఎలాన్ మస్క్ హైస్పీడ్ ఇంటర్నెట్ తీసుకొచ్చేస్తున్నారు.

ఇండియా అంతటా హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు

ఎలాన్ మస్క్ తన స్టార్‌లింక్ కంపెనీ ద్వారా ఇండియాలో హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసేశారు. భారత ప్రభుత్వం నుంచి రావాల్సిన దాదాపు అన్ని రకాల పర్మీషన్లు కూడా పొందారు. తర్వలోనే ఇండియాలో స్టార్ లింక్ సేవలు ప్రారంభం కానున్న ఈ సమయంలో మస్క్ వినియోగదారులను ఆకర్షించేందుకు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు.

స్టార్ లింక్ సేవలు నచ్చితేనే తీసుకోవచ్చు

స్టార్ లింక్ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకొనే ముందు ఒక నెల ఉచితంగా వాడి చూడమంటున్నారు. మీ ఊరిలో, మీ ప్రాంతంలో స్టార్ లింక్ ఇంటర్నెట్ సేవలు సక్రమంగా అందుతున్నాయని మీకు అనిపిస్తేనే కనెక్షన్ తీసుకోమని ప్రకటించారు.

ఇతర దేశాల్లోనూ ఇదే ఇంటర్నెట్ ధరలు

స్టార్ లింక్ సేవలు పొందాలంటే డిష్ కోసం రూ.33,000 కట్టాలి. తర్వాత ప్రతి నెల రూ.3,000 కడితే అన్‌లిమిటెడ్ డేటా లభిస్తుంది. దీని ద్వారా దూర ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ వస్తుంది. ఇతర దేశాల్లో కూడా ఇదే ధర ఉంది. బంగ్లాదేశ్, భూటాన్‌లో కూడా డిష్ ధర రూ.33,000గా నిర్ణయించారు.

భారత ప్రభుత్వం అన్ని పర్మీషన్లు ఇచ్చింది

భారత ప్రభుత్వం నుంచి స్టార్ లింక్ సేవలు ప్రారంభించడానికి అవసరమైన లైసెన్స్, ఇతర పర్మీషన్లు వచ్చేశాయి. త్వరలోనే స్టార్‌లింక్ సర్వీస్ ఇండియాలో మొదలవుతుంది. రెండు నెలల్లో సర్వీస్ మొదలు పెట్టాలన్న ఆలోచనలో కంపెనీ ఉందని సమాచారం.

స్టార్ లింక్ ఇంటర్నెట్ సర్వీస్ ద్వారా ఇండియాలో దూర ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ వస్తుంది. కేబుల్స్ అవసరం లేకుండా ఫాస్ట్ ఇంటర్నెట్ వస్తుంది. శాటిలైట్ ద్వారా అందే ఈ సేవలు ప్రస్తుతం ఇండియాలో ఏ ఇతర టెలికాం సంస్థలు ఇవ్వడం లేదు.

టెలికాం కంపెనీల మధ్య పోటీ తప్పదు

స్టార్‌లింక్ సేవలు ప్రారంభమైతే ఇండియాలో టెలికాం కంపెనీల మధ్య పోటీ విపరీతంగా పెరుగుతుంది. దూర ప్రాంతాలకు, కంపెనీలకు, స్కూళ్లకు హైస్పీడ్ ఇంటర్నెట్ వస్తుంది. అడవులు, కొండలు, లోయ ప్రాంతాలు ఇలా ఇంటర్నెట్ సిగ్నల్స్ లేని చోట్లకు కూడా స్టార్ లింక్ సేవలు అందుతాయి.