కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కొడంగల్ లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రేవంత్ అనుచరుల ఆందోళనలతో అట్టుడికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ కక్షతోనే రేవంత్ ను అరెస్ట్ చేయించారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ తాజాగా ఓ ట్వీట్ చేశారు. రేవంత్ అరెస్ట్ కు కేసీఆర్ కు ఎలాంటి సంభందం లేదంటూ కాంగ్రెస్ నాయకుల ఆరోపణలను కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తిప్పికొట్టారు.  

మహాకూటమి  ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ తో తెలంగాణలో ప్రచారం చేయించవచ్చు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం సొంత రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుంటే అడ్డుకుంటామనడం ఎంతవరకు సమంజసమని కేటీఆర్ ప్రశ్నించారు. 

అలాగే ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమీషన్  వద్దే అధికారాలన్నీ ఉంటాయి.కాబట్టి ఈసీ ఆదేశాలతోనే రేవంత్ అరెస్ట్ జరిగిందన్నారు. కొడంగల్ లో సీఎం ప్రచార సభను అడ్డుకోడానికి ప్రయత్నించే క్రమంలో శాంతి భద్రతలకు భంగం కలిగే అవకాశం ఉందన్న కారణాలతోనే రేవంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. అంతేకాని ఇందులో సీఎం
జోక్యమైమీ లేదని కేటీఆర్  ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు.  

సంబంధిత వార్తలు

''రేవంత్ ఓ బ్రహ్మోస్ మిస్సైల్... కేసీఆర్ తట్టుకోలేడు''

రేవంత్ రెడ్డి అరెస్ట్: ఎందుకో రేపు చెబుతామన్న ఏజీ

దిగొచ్చిన పోలీసులు: కొడంగల్‌కు రేవంత్ రెడ్డి తరలింపు

రేవంత్‌కు అస్వస్థత: వైద్యుల చికిత్స

డీజీపీకి షాక్: రేవంత్ విడుదలకు రజత్ కుమార్ ఆదేశాలు

రేవంత్ రెడ్డి అరెస్ట్: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ రెడ్డి అరెస్ట్: హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్

ఎన్నికల ఎఫెక్ట్.. గుడ్లగూబలతో నేతల క్షుద్రపూజలు

రేవంత్ అరెస్ట్ పై వంటేరు సీరియస్

రేవంత్ రెడ్డి భూముల్లో జేసీబీతో గోడ కూల్చివేత

రేవంత్ రెడ్డి అరెస్ట్: న్యాయవాది ఏమన్నారంటే...

రేవంత్ రెడ్డి అరెస్ట్‌: ముందు ఏం జరిగిందంటే?

రేవంత్‌రెడ్డి అరెస్ట్ ...కొడంగల్‌లో ఉద్రిక్తత, 144 సెక్షన్ (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్: జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలింపు

నా భర్తను టెర్రరిస్ట్‌ను లాక్కెళ్లినట్టు ఈడ్చుకెళ్లారు: రేవంత్ భార్య (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్..తాళాలు పగొలగొట్టి ఇంట్లోకి వెళ్లిన పోలీసులు (వీడియో)

సీఎంలు, పీఎంలు వస్తుంటే అరెస్ట్ చేయమని ఎక్కడుంది: కుంతియా

నీ కూతురి బెడ్‌రూమ్‌ బద్దలుకొడితే ఊరుకుంటావా: కేసీఆర్‌కు జైపాల్ రెడ్డి కౌంటర్