ఎన్నికల్లో గెలుపుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తన  అదికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు గూడూరు నారాయణ రెడ్డి ఆరోపించారు. అర్థరాత్రి ఇంటి తలుపుల బద్దలుగొట్టి మరీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ని పోలీసుల చేత అరెస్ట్ చేయించడం అక్రమమన్నారు. రేవంత్ అంటే ఏదో మామూలు వ్యక్తని కేసీఆర్  భావిస్తున్నట్లున్నారు...కానీ ఆయనో బ్రహోస్ మిస్సైల్ వంటివాడని...ఆ దాటికి టీఆర్ఎస్ పతనమవడం ఖాయమని గూడూరు హెచ్చరించారు.

మంగళ వారం ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొడంగల్‌లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్న నేపథ్యంలో ఆయన రాకను వ్యతిరేకిస్తే కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి నియోజకవర్గ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందన్న కారణంతో అర్థరాత్రి  రేవంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కొడంగల్ లోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయం వేడెక్కింది. 

రేవంత్ కు మద్దతుగా కొడంగల్ లో కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. ఈ సమయంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులతో పాటు ఏకంగా  ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ కూడా రేవంత్ అరెస్ట్ ను ఖండించారు. చివరకు ఈ ఘటనపై హైకోర్టు జోక్యం చేసుకుని రేవంత్ ను వెంటనే విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

రేవంత్ రెడ్డి అరెస్ట్: ఎందుకో రేపు చెబుతామన్న ఏజీ

దిగొచ్చిన పోలీసులు: కొడంగల్‌కు రేవంత్ రెడ్డి తరలింపు

రేవంత్‌కు అస్వస్థత: వైద్యుల చికిత్స

డీజీపీకి షాక్: రేవంత్ విడుదలకు రజత్ కుమార్ ఆదేశాలు

రేవంత్ రెడ్డి అరెస్ట్: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ రెడ్డి అరెస్ట్: హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్

ఎన్నికల ఎఫెక్ట్.. గుడ్లగూబలతో నేతల క్షుద్రపూజలు

రేవంత్ అరెస్ట్ పై వంటేరు సీరియస్

రేవంత్ రెడ్డి భూముల్లో జేసీబీతో గోడ కూల్చివేత

రేవంత్ రెడ్డి అరెస్ట్: న్యాయవాది ఏమన్నారంటే...

రేవంత్ రెడ్డి అరెస్ట్‌: ముందు ఏం జరిగిందంటే?

రేవంత్‌రెడ్డి అరెస్ట్ ...కొడంగల్‌లో ఉద్రిక్తత, 144 సెక్షన్ (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్: జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలింపు

నా భర్తను టెర్రరిస్ట్‌ను లాక్కెళ్లినట్టు ఈడ్చుకెళ్లారు: రేవంత్ భార్య (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్..తాళాలు పగొలగొట్టి ఇంట్లోకి వెళ్లిన పోలీసులు (వీడియో)

సీఎంలు, పీఎంలు వస్తుంటే అరెస్ట్ చేయమని ఎక్కడుంది: కుంతియా

నీ కూతురి బెడ్‌రూమ్‌ బద్దలుకొడితే ఊరుకుంటావా: కేసీఆర్‌కు జైపాల్ రెడ్డి కౌంటర్