Asianet News TeluguAsianet News Telugu

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భూపాలపల్లి: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ దుర్మార్గుడు  వరుసకు కూతురైన  బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.  

man arrested for rape on step daughter in bhupalapally district
Author
Bhupalpally, First Published Sep 18, 2018, 11:01 AM IST


జయశంకర్ భూపాలపల్లి: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ దుర్మార్గుడు  వరుసకు కూతురైన  బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.  తల్లిని చంపుతానని బెదిరించి ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన  ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు  కేసు నమోదు చేశారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గోవిందరావుపేట మండలకేంద్రానికి చెందిన  మహిళకు అదే గ్రామానికి చెందిన  వ్యక్తితో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఏడాది తర్వాత ఈ దంపతులకు కుమార్తె పుట్టింది. ఆ తర్వాత అనారోగ్యంతో అతను మరణించాడు. 

దీంతో భార్య మరణించిన ములుగు మండలానికి చెందిన ఓ వ్యక్తిని ఆమె రెండో వివాహం చేసుకొంది.  కూతురును పుట్టింట్లో ఉంచింది. అమ్మమ్మ వద్ద ఉంటూ  అదే మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో  8వ, తరగతి చదువుతోంది.

అనారోగ్యంతో  బాధపడుతున్న ఆ బాలికకు చికిత్స చేయించాలని  చెప్పి సవతి తండ్రి ఆ బాలికను  ఈ నెల 9వ తేదీన హాస్టల్ నుండి తీసుకొచ్చాడు. మోటార్ సైకిల్‌పై తీసుకొస్తూ  ఇంచర్ల పంచాయితీ పరిధిలోని  చెట్లపొదల్లోకి తీసుకెళ్లి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ విషయాన్ని బయట చెబితే  అమ్మతో పాటు అమ్మమ్మను కూడ చంపేస్తానని బెదిరించాడు. మరునాడు ఉదయం ఆ బాలికను అమ్మమ్మ వద్ద వదిలేశాడు.  ఈ నెల 16 వతేదీన  బాలికకు స్నానం చేయిస్తున్న సమయంలో  ఒంటిపై ఉన్న గాయాలను గమనించిన అమ్మమ్మ బాలికను విషయం అడిగింది. దీంతో  అసలు విషయాన్ని బాధితురాలు చెప్పింది.  ములుగు పోలీసులకు  ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

ఈ వార్తలు చదవండి

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

 

 

Follow Us:
Download App:
  • android
  • ios