Asianet News TeluguAsianet News Telugu

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

:పంజాబ్ రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో ఆప్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హర్వీందర్ సింగ్ అలియాస్ హిందా హత్యకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Wife hired 3 for murder of AAP candidate Hinda: Punjab Cops
Author
Punjab, First Published Sep 14, 2018, 11:57 AM IST

భటిండా:పంజాబ్ రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో ఆప్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హర్వీందర్ సింగ్ అలియాస్ హిందా హత్యకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.హర్వీందర్ సింగ్ భార్య కిరణ్ పాల్ కౌర్ ముగ్గురు కిరాయి హంతకులతో కలిసి ఈ హత్య చేయించిందని  పోలీసులు నిర్ధారించారు.

కిరణ్‌పాల్‌కు డ్రైవర్ సందీప్ కుమార్ తో వివాహేతర సంబంధం ఉంది. దీంతో హర్వీందర్ సింగ్ ను తప్పిస్తే సందీప్ కుమార్ తో హాయిగా ఉండొచ్చని ఆమె భావించింది. దీంతో సెప్టెంబర్ 9వ తేదీన ముగ్గురు కిరాయి హంతకులు  ఎం. రాము, చంకౌర్ సింగ్, జల్మాల్ సింగ్ లు హర్వీందర్ సింగ్ ను హత్య చేశారు.  

హర్వీందర్ సింగ్ హత్య వెనుక రాజకీయ కుట్ర లేదని పోలీసులు తేల్చి చెప్పారు. ఈ హత్యతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలనే డిమాండ్ కూడ వచ్చింది. అయితే ఈ హత్యకు  రాజకీయ  కారణాలు లేవని తేలిందని పోలీసులు  చెప్పారు.

కిరణ్ పాల్ సింగ్ తన భర్తను హత్య చేసేందుకు ఆరు మాసాల క్రితమే ప్లాన్ చేసినట్టు గుర్తించారు. అయితే కిరాయి హంతకులు  ఈ హత్య చేసేందుకు ఆ సమయంలో అంగీకరించలేదు. ఆ తర్వాత ఈ నేరం చేసేందుకు వారు ముందుకు వచ్చారు. దీంతో సెప్టెంబర్ 9వ తేదీన హర్వీందర్ సింగ్ ను ఇంట్లోనే హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు.

ఈ హత్య జరిగిన రోజు నుండి కిరణ్ పాల్ సింగ్  పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు.అయితే మకాన్ రామ్ అనే బాబా సహయంతో కిరణ్ పాల్ సింగ్  ముగ్గురు కాంట్రాక్టు కిల్లర్స్ తో ఒప్పందం చేసుకొందని  పోలీసులు తెలిపారు.

కిరణ్ పాల్ సింగ్  ప్రియుడు  సందీప్ కుమార్  పారిపోయినట్టు పోలీసులు తెలిపారు. సందీప్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు చెప్పారు.

సెప్టెంబర్ 9వ తేదీ రాత్రి హర్వీందర్ కు ఇచ్చిన భోజనంలో  కిరణ్ పాల్ సింగ్  నిద్రమాత్రలు వేసిందన్నారు. అతను మత్తులోకి జారుకొన్న తర్వాత ముగ్గురు కిరాయి హంతకలు  హర్వీందర్ సింగ్ ను దిండుతో ఊపిరాడకుండా చేయడంతో పాటు హకీ స్టిక్ తో బలంగా తలపై మోదడంతో మృతి చెందినట్టు ఆన చెప్పారు..


ఈ వార్తలు చదవండి

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

Follow Us:
Download App:
  • android
  • ios