Asianet News Telugu

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

వివాహేతర సంబంధం కారణంగా  భర్తలను హత్య  చేస్తున్న భార్యల ఘటనలు చోటు చేసుకొంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో 
ఈ ఘటనలు ఎక్కువగా చోటు చేసుకొంటున్నాయి. 

these wives killed husbands
Author
Hyderabad, First Published Sep 3, 2018, 5:33 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హైదరాబాద్: వివాహేతర సంబంధం కారణంగా  భర్తలను హత్య  చేస్తున్న భార్యల ఘటనలు చోటు చేసుకొంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో 
ఈ ఘటనలు ఎక్కువగా చోటు చేసుకొంటున్నాయి. 

సినిమాలు,  సీరియళ్ల ప్రభావంతోనో ఇతరత్రా కారణాలతోనే ఈ ఘటనలు చోటు చేసుకొంటున్నాయి. ముఖ్యంగా ప్రియుడి మోజులో  పడి ఎక్కువగా భార్యలు  తమ భర్తలను అంతం చేస్తున్నారు.తాత్కాలిక సుఖం కోసం భర్తలను హత్య చేస్తున్నారు. భర్తలను హత్య చేస్తే  తమకు అడ్డు ఉందని భావిస్తున్నారు. కానీ, భవిష్యత్ లో జరిగే పరిణామాలను మాత్రం పట్టించుకోవడం లేదు. 

తెలంగాణాలోని నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రియుడు  రాజేష్ మోజులో పడి భర్త సుధాకర్ రెడ్డిని స్వాతి హత్య చేసింది.ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే  సంచలనం సృష్టించింది.

భర్త స్థానంలో ప్రియుడు రాజేష్ ను తీసుకురావాలని ఆమె ప్లాన్ చేసింది. అయితే ఈ విషయంలోనే ఆమె ప్లాన్ బెడిసికొట్టింది.  దీంతో  ప్రియుడి రాజేష్, స్వాతిల బండారం బట్టబయలైంది. సుధాకర్ రెడ్డిని హత్య చేసినట్టు  తేలింది. గత ఏడాది నాగర్ కర్నూల్ లో జరిగిన ఈ ఘటన  పెద్ద సంచలనం.

గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం పాతులూరుకు చెందిన శ్రీవిద్య తన బావతో వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తను చంపింది. ఈ ఘటనలో నిందితుడు గొట్టిపాటి వీరయ్యతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. బావతో కలిసి భర్తకు మద్యంలో విషం కలిపి ఇచ్చి భార్య చంపింది. గుంటూరు జిల్లాకు చెందిన నరేంద్రచంద్ర, శ్రీవిద్యలు భార్యాభర్తలు. ఈ ఘటన కూడ గత ఏడాది చోటు చేసుకొంది. 

శ్రీవిద్యకు బావ అయ్యే వీరయ్యతో పెళ్లికి ముందే వివాహేతర సంబంధం ఉంది. పెళ్లయ్యాక బావతో కలిసేందుకు సమయం దొరకడం లేదు. దీంతో   భర్త నరేంద్ర అడ్డుగా తొలగించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ హత్య చేసినట్లు గుర్తించారు.

తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. కొండమల్లెపల్లి సమీపంలోని ఏపూరు తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అర్థరాత్రి దిండుతో ఊపిరాడకుండా చేసి ఆమె భర్తను చంపేసింది. 

భర్త సోమాను హత్య చేసిన ఉదంతంలో పోలీసులు భార్య భారతిని అరెస్టు చేశారు. వరుసకు బావ అయ్యే రమావత్‌ శివ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. గత ఏడాది డిసెంబర్‌ 28 రాత్రి మద్యం మత్తులో ఉన్న సోమ భార్య, కుమారుడితో గొడవ పడి నిద్రపోయారు. 

ఇదే అదనుగా భావించిన భారతి ప్రియుడు శివకు ఫోన్‌ చేసి ఇంటికి పిలిపించుకుంది. భారతి, ప్రియుడు శివ ఇద్దరూ కలిసి హత్య చేశారు. మంచంపై నిద్రపోయిన సోమాను శివ గట్టిగా గొంతు నులమగా, భారతి భర్త సోమా ముఖంపై బొంతను వేసి ఊపిరి ఆడకుండా చేయడంతో అతను మృతి చెందారు.

తెలంగాణలోని కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని చింతల మానేపల్లి మండలం బాలాజీ అనుకోడ గ్రామంలో భర్తను భార్య చంపింది. మల్లూరి భిక్షపతి (33)కి బాయక్కతో 16 ఏళ్ల కింద వివాహం జరిగింది. బాయక్కకు అదే గ్రామానికి చెందిన ఓ మాజీ నక్సలైట్‌తో వివాహేతర సంబంధం ఉంది. తమకు అడ్డు ఉన్నాడనే కారణంతో భర్త భిక్షపతిని చంపాలని బాయక్క పథకం వేసి హత్య చేసింది.

ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలంలో అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తనే ఓ భార్య ప్రియుడితో కలిసి చంపిన సంఘటన ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం తాటిమీదగుంపు గ్రామంలో జరిగింది. ఎర్రయ్య నిద్రిస్తున్న సమయంలో తన ప్రియుడిని పిలిపించి, అతని సహాయంతో భర్త గొంతు నులిమి చంపేసింది. ఇది తెలిసిన గ్రామస్తులు ఆమెను చితకబాది, అరగుండు కొట్టించి ఊరేగించారు.

అనంతపురం నగర శివారులో రుద్రంపేట పంచాయతీ పంతులకాలనీలో నివాసం ఉంటున్న కిష్టప్పను జాతీయ రహదారి కక్కలపల్లి క్రాస్‌ సమీపంలో హత్య చేశారు. కిష్టప్ప తొమ్మిదేళ్ల క్రితం నిందితులలో ఒకరైన శ్వేతను పెళ్లి చేసుకున్నాడు.

 ఇద్దరు కలిసి పండ్ల తోటల్లో కూలీ పని చేసేవారు. ఈ క్రమంలో కిష్టప్పకు నూతిమడుగుకు చెందిన కృష్ణతో పాటు మామిడాకులపల్లికి చెందిన అక్కులన్న అలియాస్‌ సూరితో పరిచయాలు ఏర్పడ్డాయి. వారిద్దరూ అప్పుడప్పుడూ కిష్టప్ప ఇంటికి వచ్చి వెళ్లేవారు. 

ఈ క్రమంలో శ్వేతతో చనువుగా ఉండేవారు. ఈ విషయంపై కిష్టప్ప భార్యను మందలించాడు. దీనిని జీర్ణించుకోలేని భార్య ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది. కిష్టప్పను చంపితే తాము కలిసి ఉండవచ్చని కృష్ణతో తెలిపింది. కృష్ణ కూడా అంగీకరించాడు. అక్కులన్న, హరి, శ్వేత సహాయంతో కృష్ణ కిష్టప్పను హత్య చేశాడు.

వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తను ఇద్దరు వ్యక్తులతో కలిసి భార్య హతమార్చిన సంఘటన హైదరాబాదులో 2014 మేలో వెలుగులోకి వచ్చింది. మహబూబ్ నగర్ జిల్లా దౌల్తాబాద్ మండలం అంతారం గ్రామానికి చెందిన లక్ష్మప్ప పదిహేనేళ్ల క్రితం అమృత అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. 

ఆమృత రెండుసార్లు స్వగ్రామానికి ఒంటరిగా వెళ్లింది. గత వారం ఓటు వేయడానికి వచ్చిన ఆమెను గ్రామస్థులు భర్త గురించి అడిగారు. అయితే తాను హత్య చేసినట్లు చెప్పింది. అంతారం గ్రామస్థులు నార్సింగి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని గుర్తించారు. అమృతను, వివాహేతర సంబంధం కలిగిన గోపాల్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

తన భర్త టెక్కీని భార్య హత్య చేయించిన ఉదంతం హైదరాబాదులో సంచలనం సృష్టించింది. నాగరాజు అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భార్య జ్యోతి తన ప్రియుదు కార్తిక్‌తో కలిసి హత్య చేసింది. కేసు నుంచి తప్పించుకోవడానికి హత్య ఘటనలో పాలుపంచుకున్న నరేష్ అనే యువకుడు  ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో ఈ ఘటన వెలుగు చూసింది.

రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్‌లో  ఈ ఏడాది మే 7వ తేదీన ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసింది. ప్రియుడితో కలిసి ఓ భార్య తన భర్తను చంపేసింది. అనంతరం మృతదేహాన్ని తగులబెట్టి మూసినదిలో పడేశారు. మృతుడిని శివరాంపల్లికి చెందిన ఆనంద్‌గా గుర్తించారు. మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు మూడు నెలల క్రితం భర్తను చంపేసింది.

ఆ తర్వాత మూసినదిలో పడేసి, రెండు మూడు రోజుల తర్వాత పోలీసులకు భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. పోలీసులు అన్ని కోణాల్లోను దర్యాఫ్తు జరిపారు. కానీ ఎక్కడా క్లూ దొరకలేదు. దీంతో వారు భార్యను అనుమానించారు. ఆ దిశగా దర్యాఫ్తు చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. పోలీసులు వారిని అరెస్టు చేశారు.

వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడనే ప్రియుడితో కలిసి హత్య చేసింది. కేసు మిస్టరీ దాదాపు మూడు నెలల తర్వాత వీడింది. వికారాబాద్ జిల్లా బొమ్మరాస్‌పేట మండలం లింగపల్లి గ్రామానికి చెందిన ఆనంద్, మహేశ్వరిలకు పెళ్లయింది. వారు ఎనిమిదేళ్లుగా రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లిలో ఉంటున్నారు.

ఈ ఏడాది మే 7వ తేదీన రాత్రి ఆనంద్ మద్యం తాగి నిద్రపోయాడు. అదే అదనుగా భావించిన మహేశ్వరి ప్రియుడు సంజీవ్‌ను పిలిపించింది. ఇద్దరు కలిసి ఆనంద్ గొంతుకు తీగ చుట్టి హత్య చేశారు.

ఈ ఏడాది మే 7వ తేదీనే విజయనగరం జిల్లాలో పెళ్లైన వారం రోజులకే భార్య సరస్వతి  తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేయించింది. ఈ మేరకు తన ఎంగేజ్ మెంట్ రింగ్ కూడ ప్రియుడికి ఇచ్చేసింది. దోపీడి దొంగలు తన భర్తను హత్య చేశారని సరస్వతి  పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ,  చివరకు పోలీసుల విచారణలో ప్రియుడి శివతో కలిసి  భార్య సరస్వతి ఈ ప్లాన్ చేసిందని తేలింది.

ఈ ఏడాది ఆగష్టు 9వ తేదీన  హైద్రాబాద్ ఫిలిం నగర్ లో  కూడ  జగన్ ను ఆయన భార్య దేవిక  హత్య చేసింది. బెనర్జీ అనే వ్యక్తితో రాసలీలలకు అడ్డుగా ఉన్నాడని జగన్ ను ఆమె హత్య చేసింది.

తాజాగా వనస్థలిపురంలో ఉద్యోగం, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం డ్రైవర్ తో కలిసి భర్త కేశ్యనాయక్ ను  భార్య పద్మ హత్య చేసింది.ఈ ఘటన  వనస్థలిపురంలో చోటు చేసుకొంది. 

ఈ వార్తలు చదవండి

ప్రియురాలితో రాసలీలలు: సోషల్ మీడియాలో వైరల్ గా వీడియో, బాధితులిలా..

నపుంసకుడు, నగ్న చిత్రాలతో బ్లాక్ మెయిల్: టెక్కీపై భార్య ఆరోపణలు

ఆ అవసరం లేదు: భార్య ఆరోపణలపై టెక్కీ

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

వివాహేతర సంబంధం: ప్రశ్నించిన భర్తను చంపిన భార్య లవర్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

Follow Us:
Download App:
  • android
  • ios