విశాఖపట్టణం: భార్య అనారోగ్యానికి గురికావడంతో ఐదేళ్లుగా మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ విషయాన్ని ప్రశ్నించిన  భార్యను  కొట్టి చంపాడు . ఈ ఘటన  విశాఖ జిల్లాలో చోటు చేసుకొంది.

విశాఖ జిల్లాలోని  కోరాపల్లి గ్రామానికి చెందిన కోరాబు లక్షీనాయుడు‌కు సొలభం పంచాయితీ పరిధిలోని కొత్త కొండలు గ్రామానికి చెందిన జానకమ్మతో 15 ఏళ్ల జానకమ్మతో వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలున్నారు. వ్యవసాయం చేస్తూ  వీరు జీవనం సాగిస్తున్నారు.

ఐదేళ్ల క్రితం జానకమ్మ అనారోగ్యానికి గురైంది. అనారోగ్యం కారణంగా  జానకమ్మ కాలు,చేయి పడిపోయింది. ఈ కారణాలను దృష్టిలో ఉంచుకొని  లక్ష్మీనాయుడు మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకొన్నాడు. భార్యాపిల్లలను  కూడ పట్టించుకోవడం మానేశాడు.

వివాహేతర సంబంధం విషయమై  లక్ష్మీనాయుడును జానకమ్మ  శనివారం నాడు రాత్రి ప్రశ్నించింది. భార్యాభర్తల మధ్య ఈ విషయమై మరోసారి గొడవ చోటుచేసుకొంది. జానకమ్మపై లక్ష్మీనాయుడు కోపంతో కత్తితో పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే  మరణించింది.

ఈ ఘటనపై  ఆదివారం నాడు  జానకమ్మ సోదరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మీనాయుడు పరారీలో ఉన్నారు.
 

ఈ వార్తలు చదవండి

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య