Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ ఎంపీ అభ్యర్థుల్లో సిరిమంతులే అధికం.. 

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో చాలా మంది సిరిమంతులే కావడం గమనార్హం. అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాల్లో ఆస్తులు, అప్పులతో పాటు మరి కొన్ని వివరాలను పేర్కొనడంతో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. 

Parliaments election In Telangana Richest Candidates KRJ
Author
First Published Apr 25, 2024, 10:55 PM IST

తెలంగాణలో లోక్ సభ  ఎన్నికల్లో పోటీ చేసేందుకు బుధవారం పలువురు అభ్యర్థులు బుధవారం నామినేషన్లు వేశారు. ఇందులో వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఉన్నారు. అయితే ఇందులో అత్యధికంగా సిరిమంతులే ఉన్నారు. అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాల్లో ఆస్తులు, అప్పులతో పాటు మరి కొన్ని వివరాలను పేర్కొన్నారు. దాని ప్రకారం అభ్యర్థుల ఆస్తి పాస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. 

కొంపెల్ల మాధవీలత - బీజేపీ 

హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరుఫున కొంపెల్ల మాధవీలత నామినేషన్ దాఖలు చేశారు. ఆమె కుటుంబ ఆస్తుల విలువ రూ.221.40 కోట్లు ఉన్నాయని నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. విరించి లిమిటెడ్, వివో బయోటెక్ లో రూ.8.92 కోట్ల విలువైన షేర్లు ఆమె పేరిట ఉన్నాయి. అలాగే గజ్వేల్ డెవలపర్స్, పీకేఐ సొల్యూషన్స్, విరా సిస్టమ్స్ లో రూ.16.27 కోట్ల షేర్లు ఉన్నాయని మాధవీలత వెల్లడించారు. భర్త కొంపెల్ల విశ్వనాథ్ కు కూడా పలు సంస్థల్లో 85.75 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. మాధవీలతకు 3.9 కిలోల బంగారం, భర్తకు 1.11 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. 165.47 కోట్ల చరాస్థులు, 55.92 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ఒక క్రిమినల్ కేసుతో పాటు రూ.27.03 కోట్ల అప్పులు ఉన్నాయని మాధవీలత తన నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. 

నామా నాగేశ్వరరావు - బీఆర్ఎస్ 

ఖమ్మం లోక్ సభ స్థానానికి బీఆర్ఎస్ తరఫున నామినేషన్ దాఖలు చేసిన నామా నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన కుటుంబ ఆస్తుల విలువ రూ.155.90 కోట్లు ఉన్నాయి. పల కంపెనీల్లో షేర్స్,  మూడు కార్లు ఉన్నాయి. భార్యకు 2.5 కిలోల బంగారం ఉంది. 72.03 కోట్ల చరాస్తులు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 108 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. తెలంగాణలో, ఢిల్లీలో రూ.83.87 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. రెండు క్రిమినల్ కేసు ఉన్నాయి. 

వెంకట్రామిరెడ్డి - బీఆర్ఎస్

మెదక్‌ లోక్ సభ స్థానానికి బీఆర్ఎస్ తరుఫున వెంకట్రామిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన కుటుంబానికి రూ. 63.58 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అలాగే భార్యకు 3.3 కిలోల బంగారం ఉంది. ఆయనకు 10 తులాల బంగారం ఉంది. రాజపుష్ప ఫామ్స్ లో రూ.4.48 కోట్ల పెట్టబడి పెట్టినట్టు ఆయన వెల్లడించారు. అలాగే రెండు కిలోల వెండి వస్తువులు ఉన్నట్టు చెప్పారు. చరాస్తుల విలువ రూ.9.97 కోట్లు, స్థిరాస్థుల విలువ 53.60 కోట్లుగా ఉంది. ఓ క్రిమినల్ కేసుతో పాటు రూ.9.8 కోట్ల అప్పు ఉంది. 

మల్లు రవి - కాంగ్రెస్ 

నాగర్‌కర్నూల్‌ నుంచి కాంగ్రెస్ తరుఫున మల్లు రవి నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం కుటుంబ ఆస్తుల విలువ 52.32 కోట్లు ఉన్నాయి. పలు కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయి. 4.5 తులాల బంగారం, భార్యకు 87.5 తులాల బంగారం ఉంది. అలాగే 10 క్యారెట్ల వజ్రాలు ఉన్నాయి. భార్యకు రూ.25.61 కోట్ల చరాస్తులు, ఆయనకు రూ.20.66 లక్షల ఆస్తులు ఉన్నాయి. మొత్తంగా 26.49 కోట్ల స్థిరాస్తులు, రూ.4.42 కోట్ల అప్పులు ఉన్నాయి. ఆయనపై ఐదు క్రిమినల్ కేసులు ఉన్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios