వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంగా భర్తను ప్రియుడితో పాటు మరో ముగ్గురితో కలిసి హత్య చేయించింది

కడప:వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంగా భర్తను ప్రియుడితో పాటు మరో ముగ్గురితో కలిసి హత్య చేయించింది భార్య. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో చోటు చేసుకొంది. ఈ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

కడప జిల్లా ముద్దనూరు మండలం కోసినేపల్లి గ్రామానికి చెందిన కునపులి గంగానాయుడుకు కుళ్లాయమ్మకు కొన్నేళ్ల కిందట వివాహమైంది. గంగానాయుడు ఆర్టీపీపీలోని కోల్‌ప్లాంట్‌ లో పై పని చేస్తున్నారు. 

అదే గ్రామానికి చెందిన చందా సునీల్‌కుమార్‌తో కుళ్లాయమ్మ వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం గంగానాయుడుకు తెలిసింది. దీంతో సునీల్‌కుమార్ ను మందలించాడు. గంగానాయుడు విధులకు వెళ్లగానే ప్రియుడు సునీల్ తో కుళ్లాయమ్మ రాసలీలల్లో ముగినిపోయేదని విచారణలో పోలీసులు గుర్తించారు.

అయితే సునీల్‌కుమార్ ను కూడ చంపేస్తానని గంగానాయుడు ఆవేశంలో అప్పుడప్పుడూ అనేవాడని స్థానికులు చెప్పారు. అయితే గంగానాయుడు బతికి ఉంటే తమ బంధం కొనసాగించలేమని భావించారు. దీంతో అతడిని చంపాలని ప్లాన్ చేశారు.

విధులకు వెళ్లే సమయంలో చంపేసీ రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని భావించారు. సెప్టెంబర్ 4వ తేదీన గంగానాయుడు ఆర్టీపీపీలో పనికి బయలుదేరగానే ఆ విషయాన్ని సునీల్ కుమార్ కు కుళ్లాయమ్మ చెప్పింది.

సునీల్ కుమార్ అదే గ్రామానికి చెందిన గంగరాజు, వీరభద్రుడలకు డబ్బులను ఆశ చూపి గంగరాజు తోట వద్ద గంగనాయుడును కొట్టి చంపేశారు. శవాన్ని ఆర్టీపీపీ, సున్నపురాళ్లపల్లి రోడ్డుపై వేసి రోడ్డుపక్కన ద్విచక్ర వాహాన్ని పడేసీ వెళ్లిపోయారు.

తొలుత ఈ కేసును అనుమానాస్పద కేసుగా గుర్తించిన పోలీసులు దర్యాప్తులో అసలు విషయాలను గుర్తించారు. నిందితులను విచారిస్తే అసలు విషయాన్ని ఒప్పుకొన్నారు. కుళ్లాయమ్మతో పాటు సునీల్ కుమార్, గంగారాజు, వీరభద్రుడును అరెస్ట్ చేశారు.


ఈ వార్తలను చదవండి

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

ప్రియురాలితో రాసలీలలు: సోషల్ మీడియాలో వైరల్ గా వీడియో, బాధితులిలా..

నపుంసకుడు, నగ్న చిత్రాలతో బ్లాక్ మెయిల్: టెక్కీపై భార్య ఆరోపణలు

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్