Asianet News Telugu

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో రాంబాబు అనుమానాస్పద మృతి వెనుక భార్య, ప్రియుడు హస్తం ఉందని పోలీసులు గుర్తించారు.  

wife kills husband with the help of lover in eastgodavari district
Author
Ramachandra Puram, First Published Sep 12, 2018, 11:35 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp


రామచంద్రాపురం: తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో రాంబాబు అనుమానాస్పద మృతి వెనుక భార్య, ప్రియుడు హస్తం ఉందని పోలీసులు గుర్తించారు.  ప్రియుడితో  ఫోన్‌లో మాట్లాడితే పోలీసులకు చిక్కుతామనే ఉద్దేశ్యంతోనే ఫేస్‌బుక్ మేసేంజర్ ద్వారా కూడ మాట్లాడుకొనే వారని  పోలీసుల విచారణలో నిందితురాలు ఒప్పుకొంది.

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం పట్టణానికి చెందిన  రాంబాబు 17 ఏళ్ళ క్రితం క్రాంతి ప్రియదర్శిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు.  వీరిద్దరికి ఇద్దరు పిల్లలు.

అయితే పిల్లలు పుట్టిన తర్వాత  భార్య, భర్తల మధ్య గొడవలు వచ్చాయి. ఫేస్‌బుక్ ద్వారా క్రాంతి ప్రియదర్శినికి మోహన శివసాయి అనే యువకుడు పరిచయమయ్యాడు. ఈ పరిచయం వీరిద్దరి మధ్య వివాహేతర సంబందానికి దారి తీసింది.

అయితే  తరచూ మోహన శివసాయితో  క్రాంతి ప్రియదర్శిని మాట్లాడేది. ఈ విషయాన్ని  గమనించిన రాంబాబు  భార్యను నిలదీశాడు. ఆమె కాల్ డేటా ఆధారంగా శివసాయితో  వివాహేతర సంబంధాన్ని  గుర్తించాడు. భార్యను మందలించాడు.

ఇదిలా ఉంటే  క్రాంతి ప్రియదర్శిని  మాత్రం ప్రియుడితో సంబంధాలను కొనసాగించింది. ఆరు మాసాల క్రితం ఆమె ప్రియుడు మోహనసాయితో కలిసి చెన్నై వెళ్లిపోయింది. అక్కడే ఉంది. అయితే రాంబాబు పోలీసుల సహాయంతో  ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు.

కొంతకాలం పాటు ఆమె బాగానే ఉంది.  అయితే  ఇటీవల కాలంలో మళ్లీ ప్రియుడితో సంబంధాలను పునరుద్దరించుకొంది.ఫేస్‌బుక్ లో తరచూ వీరిద్దరూ ఛాటింగ్ చేసేవారు. 

ఫేస్‌బుక్ మేసేంజర్ ద్వారా వీరిద్దరూ ఛాటింగ్ చేసేవారు. ఫేస్ బుక్ మేసేంజర్ చాటింగ్ లోనే భర్తను చంపాలని ప్రియదర్శిని ఆమె ప్రియుడు శివమోహన కృష్ణ ప్లాన్ చేశారు.

ఫోన్లో మాట్లాడుకొంటే సెల్ టవర్ ఆధారంగా ఈ విషయం బయటకు తెలుస్తోందని  భావించి ఫేస్‌బుక్ మేసేంజర్ యాప్ ను ఉపయోగించారు.ఈ విషయాన్ని పోలీసుల విచారణలో నిందితురాలు ప్రియదర్శిని ఒప్పుకొంది.

వీరిద్దరి ప్లాన్ ప్రకారంగా ఆగష్టు 26వ తేదీన భర్తకు మత్తుమందు కలిపి భోజనం పెట్టింది. భోజనం తిన్న తర్వాత రాంబాబు మత్తులోకి జారుకొన్నాడు. అతను మత్తులోకి జారుకొన్న తర్వాత  ప్రియుడికి ప్రియదర్శిని  ఫోన్ చేసింది. అతను వచ్చిన వెంటనే దిండుతో రాంబాబు ముఖానికి అదిమిపెట్టి హత్య చేసింది. ఉదయాన్నే తన భర్త మృతి చెందినట్టుగా ఇరుగుపొరుగు వారికి చెప్పింది.

అయితే రాంబాబు తండ్రి మాత్రం తన కోడలిపై అనుమానాన్ని వ్యక్తం చేశాడు.  ఈ విషయమై పోలీసులు  దర్యాప్తు చేస్తే  అసలు విషయాన్ని ఆమె ఒప్పుకొంది. ఈ కేసులో తాను అరెస్టు అవుతానని భావించిన ప్రియదర్శిని ముందుగానే తన ప్రియుడు శివకు  రూ.2 లక్షలను కూడ ఇచ్చింది. బెయిల్ కోసం ఈ డబ్బులను  తన బెయిల్ కోసం ఉపయోగించాలని ఆమె శివకు సూచించింది. 

ఈ వార్తలు చదవండి

ప్రేమ పెళ్లి: 15 ఏళ్ల తర్వాత భర్త మృతి, ఏమైందంటే?

ప్రియుడితో కలిసి భర్తను మంచానికి కట్టేసి, ముఖంపై దిండు పెట్టి చంపిన భార్య

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

బ్యూటీషీయన్ కేసు: పద్మపై నూతన్ కుమార్ భార్య సంచలనం

దారుణం: కూతుళ్లపై ఏడాదిగా తండ్రి రేప్, దిమ్మ తిరిగే షాకిచ్చిన భార్య

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా...

భర్తకు నిద్రమాత్రలిచ్చి ప్రియుడితో ఎంజాయ్: భార్యకు షాకిచ్చిన మొగుడు

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే.

వివాహేతర సంబంధం: ప్రశ్నించిన భర్తను చంపిన భార్య లవర్

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

Follow Us:
Download App:
  • android
  • ios